దేశ రాజధానిలో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి

దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని సీలంపూర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది. ఆ వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ టీం ఇంకా సహాయక చర్యలు చేపడుతోంది. శిథిలాల కింద ఇంకా […]

దేశ రాజధానిలో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 9:04 AM

దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని సీలంపూర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది. ఆ వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ టీం ఇంకా సహాయక చర్యలు చేపడుతోంది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనేది గుర్తించే పనిలో పడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనంలో మొదటి అంతస్తులో ఓ వేడుక నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.