ముద్దు సీన్‌.. 37టేక్‌లు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Sep 03, 2019 | 2:29 PM

సినిమాల్లో ముద్దు సీన్లలో నటించడమంటే ఏ నటీనటులకైనా కాస్త కష్టంతో కూడుకున్న పనే. ఆ సమయంలో కేవలం ముద్దు పెట్టుకోవడమే కాదు డైరక్టర్ అనుకున్న ఫీల్‌ను కూడా వారు చూపించాల్సి ఉంటుంది. ఇక అలాంటి సీన్లలో తనకు సంతృప్తి లేకపోతే ఆ సన్నివేశానికి టేక్‌లు చెప్తూనే ఉంటాడు డైరక్టర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. బాలీవుడ్‌లో ఓ ముద్దు సీన్ కోసం 37టేక్‌లు చెప్పాడట ఓ డైరక్టర్. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి హీరో […]

ముద్దు సీన్‌.. 37టేక్‌లు

సినిమాల్లో ముద్దు సీన్లలో నటించడమంటే ఏ నటీనటులకైనా కాస్త కష్టంతో కూడుకున్న పనే. ఆ సమయంలో కేవలం ముద్దు పెట్టుకోవడమే కాదు డైరక్టర్ అనుకున్న ఫీల్‌ను కూడా వారు చూపించాల్సి ఉంటుంది. ఇక అలాంటి సీన్లలో తనకు సంతృప్తి లేకపోతే ఆ సన్నివేశానికి టేక్‌లు చెప్తూనే ఉంటాడు డైరక్టర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. బాలీవుడ్‌లో ఓ ముద్దు సీన్ కోసం 37టేక్‌లు చెప్పాడట ఓ డైరక్టర్.

వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్ కాంచి అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2014లో విడుదల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇందులో ఓ ముద్దు సీన్ గురించిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సీన్‌లో నటించేందుకు కార్తీక్, మిస్తీ మొదట్లో కాస్త తడబడ్డారట. దీంతో సీన్ బాగా రాలేదని భావించిన దర్శకుడు.. కట్ చెప్పేసి మళ్లీ ముద్దుపెట్టుకోమన్నారట. ఇలా చివరకు 37వ టేక్‌లో గానీ దర్శకుడు అనుకున్న విధంగా ముద్దురాలేదు. ఇక అంతసేపు ఆ సన్నివేశాన్ని చూసిన చిత్రీకరణ బృందం రకరకాల జోకులు వేసుకున్నట్లు బాలీవుడ్‌లో టాక్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Kaanchi Movie

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu