‘పావలా కల్యాణ్’ అంటూ ట్వీట్ చేసిన పవన్ హీరోయిన్.. ఆటాడేసుకున్న ఫ్యాన్స్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పవన్‌తో పనిచేసిన హీరోయిన్లు కూడా ఆయనకు తమ అభినందనలు తెలిపారు. వారిలో నిషా కళ్ల సుందరి నికీషా పటేల్ ఒకరు. పవన్ కల్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించిన ఈ సుందరి సోమవారం ఆయనకు పుట్టినరోజు విషెస్‌ చెప్పింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ట్రెండ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:43 am, Tue, 3 September 19
‘పావలా కల్యాణ్’ అంటూ ట్వీట్ చేసిన పవన్ హీరోయిన్.. ఆటాడేసుకున్న ఫ్యాన్స్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పవన్‌తో పనిచేసిన హీరోయిన్లు కూడా ఆయనకు తమ అభినందనలు తెలిపారు. వారిలో నిషా కళ్ల సుందరి నికీషా పటేల్ ఒకరు. పవన్ కల్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించిన ఈ సుందరి సోమవారం ఆయనకు పుట్టినరోజు విషెస్‌ చెప్పింది.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లను ఆమె పెట్టింది. అందులో ‘హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా పెట్టింది. అది కావాలని చేయనప్పటకీ.. పవన్ ఫ్యాన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అసలే పవన్ పుట్టినరోజు నాడు ఇలాంటి హ్యాష్ ట్యాగ్ ఇస్తే వారికి ఎలా ఉంటుంది..? దీంతో పూనకంతో ఊగిపోతూ సోషల్ మీడియాలో ఆమెకు కౌంటర్ ఇస్తూ చుక్కలు చూపించారు.

ఇక ఈ తప్పును వెంటనే గ్రహించిన నికీషా ఆ తరువాత ట్వీట్‌ను డిలీట్ చేసి మరో ట్వీట్‌ పెడుతూ విష్ చేసింది. ‘‘ఈ సారి నేను కరెక్ట్‌గానే ట్యాగ్ చేశానని భావిస్తున్నా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా కష్టంగా తయారవుతోంది. మీరందరూ దీన్ని ఎలా కొనసాగిస్తారో తెలియదు. ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి. తప్పును సరిదిద్దుకున్నా’’ అంటూ నికీషా కామెంట్ పెట్టింది. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది.