AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ‘డబ్బింగ్ మాస్టర్’.. యంగ్‌ టైగర్..!

‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బల్గేరియాలో శరవేగంగా జరుగుతోంది. అందులో ఎన్టీఆర్‌తో పాటు పలువురిపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ […]

RRR: ‘డబ్బింగ్ మాస్టర్’.. యంగ్‌ టైగర్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 03, 2019 | 12:18 PM

Share

‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బల్గేరియాలో శరవేగంగా జరుగుతోంది. అందులో ఎన్టీఆర్‌తో పాటు పలువురిపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే ఈ మూవీని తెలుగులో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. తెలుగు భాషలో మంచి పట్టున్న ఎన్టీఆర్‌కు తమిళం, హిందీతో కూడా మంచి టచ్ ఉంది. ఇక తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం వల్ల సినిమాలో ఫీల్ కూడా బావుంటుందని భావించిన ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక యంగ్ టైగర్ తీసుకున్న ఈ నిర్ణయానికి జక్కన్న కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. చెర్రీ సరసన అలియా భట్ కనిపించనుంది. దాదాపు 250కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!
మీ పిల్లలు ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే జాగ్రత్తపడండి..
మీ పిల్లలు ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే జాగ్రత్తపడండి..
బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మునిగిపోతున్న పడవ వద్దకు దూసుకొచ్చిన కోస్ట్‌గార్డ్!
మునిగిపోతున్న పడవ వద్దకు దూసుకొచ్చిన కోస్ట్‌గార్డ్!
కేవైసీ అప్‌డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందా?
కేవైసీ అప్‌డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందా?