AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Krishna: కృష్ణ-ఎస్పీబీల మధ్య మూడేళ్లు మాటలు-పాటలు లేవ్.. ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటే..

నిజానికి కెరీర్ ప్రారంభంలో బాలసుబ్రమణ్యంను కృష్ణ చాలా ప్రోత్సాహించారు. కృష్ణ నటించిన ‘నేనంటే నేనే’ సినిమాకు మొత్తం పాటలు బాలు పాడారు. అయితే వీరిద్దరి మధ్య పారితోషకం విషయంలో వచ్చిన వివాదంతో దాదాపు ముడుఏళ్ళ పాటు కృష్ణ సినిమాలకు బాలు పాటలు పాడలేదు

Superstar Krishna: కృష్ణ-ఎస్పీబీల మధ్య మూడేళ్లు మాటలు-పాటలు లేవ్.. ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటే..
Super Star Krishna Spb
Surya Kala
| Edited By: |

Updated on: Oct 11, 2023 | 6:37 PM

Share

సూపర్ స్టార్  కృష్ణ సినిమాల్లో ఘంటసాల మొదలుకొని పీబీ శ్రీనివాస్‌, బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మాధవపెద్ది రమేశ్‌, జేసుదాసు, రాజ్‌ సీతారాం అందరూ పాడారు. అయితే గాన గంధర్వుడుగా పేరుగాంచిన ఎస్పీబీ వెండి తెరపై గాయకుడిగా అడుగు పెట్టిన కొత్తలో చిన్న చిన్న నటులకు తన గాత్రాన్ని ఇచ్చేవారు. అయితే బాలసుబ్రహ్మణ్యం కు స్టార్ హీరోలకు పాడే అవకాశం వచ్చింది  మాత్రం సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతోనే. ఇదే విషయాన్నీ ఎస్పీబీ కూడా స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు. నిజానికి కెరీర్ ప్రారంభంలో బాలసుబ్రమణ్యంను కృష్ణ చాలా ప్రోత్సాహించారు.

కృష్ణ నటించిన ‘నేనంటే నేనే’ సినిమాకు మొత్తం పాటలు బాలు పాడారు. ఎస్పీ కోదండపాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలా మొదలైన వీరిద్దరి జర్నీ ఒక సినిమా పారితోషకం విషయంలో వచ్చిన విబేధం వరకూ కొనసాగింది. కృష్ణ నటించిన  ప్రతి సినిమాలో బాలు పాటలు పాడారు. అలాంటిది ఒకసారి వీరిద్దరి రెమ్యునరేషన్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ కూడా టెలిఫోన్‌లో.. జరగడం విశేషం..

అయితే కృష్ణ భోళా మనిషి. వివాద రహితుడు.. ఏదీ మనసులో పెట్టుకోరు. దీంతో తనకు బాలు తో ఉన్న విభేదాన్ని పట్టించుకోలేదు.. తన సినిమాల్లో  పాటలు పాడకపోయినా బాలసుబ్రమణ్యం ఎక్కడ కనిపించినా సంతోషంగానే పలకరించే వారని బాలు పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. నేనూ ఆయన్ని అంత గౌరవంతోనే చూశాను తప్ప ఏనాడూ మొహం తిప్పుకుని వెళ్లలేదన్నారు బాలు.

ఇవి కూడా చదవండి

అయితే మళ్లీ కృష్ణని ఎస్పీబీని కలిపింది పాటల రచయిత సుందరరామూర్తి . కృష్ణ దగ్గరకు వెళ్లిన బాలు తన సంజాయిషీ ఇవ్వకపోతే.. అదేం లేదు.. మనం మళ్ళీ ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పారు.. అప్పుడు రాజ్-కోటి సంగీత దర్శకత్వం వహించిన ‘రౌడీ నంబర్ వన్’ సినిమాతో మళ్లీ కృష్ణ, బాలు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తరవాత వీరిద్దరి కాంబోలో అద్భుతమైన పాటలు వచ్చాయి. దీంతో కృష్ణ, ఎస్పీ మధ్య ఏర్పడిన వివాదం  కథ సుఖాంతమయింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..