Prabhas Movie: ప్రభాస్ మూవీకి ఆరెస్సెస్ సెగ? అందుకే ఎలర్ట్ అయ్యారా?

Prabhas Movie: ''75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక నేత మోహన్ భగవత్ తో కొద్దిసేపు స్పెండ్ చేయడం జరిగింది..'' అంటూ డైరెక్టర్ ఓం రౌత్ వినమ్రంగా..

Prabhas Movie: ప్రభాస్ మూవీకి ఆరెస్సెస్ సెగ? అందుకే ఎలర్ట్ అయ్యారా?
Prabhas

Prabhas Movie: ”75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక నేత మోహన్ భగవత్ తో కొద్దిసేపు స్పెండ్ చేయడం జరిగింది..” అంటూ డైరెక్టర్ ఓం రౌత్ వినమ్రంగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్.. ఇప్పుడు నేషనల్ లెవల్ లో సైలెంట్ గా సెన్సేషన్ అవుతోంది. ఒక సినిమా దర్శకుడికి.. ఒక హార్డ్ కోర్ కాషాయ సంస్థతో పనేంటి? అనే సూటి ప్రశ్న జవాబు కోసం వెతుక్కుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు మిస్టర్ ఓమ్.

ఈ లేటెస్ట్ ఫోటో కింద.. ఆదిపురుష్ అప్డేట్ ఎప్పుడు బాస్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అమాయకంగా అడుగుతుంటే.. ”ఇట్స్ హారిబుల్.. ప్రభాస్ ఈజ్ వర్కింగ్ విత్ ఆరెస్సెస్ పీపుల్..” అనే తీవ్రమైన కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ఆదిపురుష్ మూవీ రామాయణ నేపథ్యంతో తీస్తున్న మూవీ కావడం.. ఆరెస్సెస్ హిందుత్వ భావజాలంతో నడిచే సంస్థ కావడం.. కొత్త అనుమానాలకు దారితీస్తోంది. పైగా.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ సీనియర్ నేత.

ప్రభాస్ రాముడిగా.. క్రితి సనన్ సీతగా నటిస్తున్న ఆదిపురుష్ మూవీలో.. సయీఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపిస్తారు. మేజర్ పోర్షన్ VFX ద్వారా చిత్రీకరించే ఈ సినిమా కోసం దేశం మొత్తం వెయిట్ చేస్తోంది. అదే సమయంలో ఆదిపురుష్ కంటెంట్ పై గతంలోనే సీరియస్ ఎలిగేషన్స్ వినిపించాయి. ”రామాయణాన్ని రావణాసురుడి కోణంలో చూద్దాం..” అంటూ తన క్యారెక్టర్ ని తానే ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశారు సయీఫ్. గతంలో ఈ కామెంట్ పై తీవ్రమైన ఆక్షేపణ వినిపించింది.

ఆదిపురుష్ లో కొత్తదనం కోసం.. రామాయణ కథ సోల్ ని దెబ్బ తీస్తున్నారా.. అనే అనుమానాలు బలంగా వినిపించాయి. కొన్ని హైందవ సంస్థలు ఆందోళనకు కూడా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం.. ఆదిపురుష్ మూవీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. మరో ఏడాదిలోగా రిలీజయ్యే ఛాన్సుంది. అందుకే.. ఆదిపురుష్ లో అభ్యంతరకరమైన అంశాలు ఏమీ ఉండవని ముందస్తు సంజాయిషీ ఇచ్చుకుంటూ ఆరెస్సెస్ నేతల్ని ప్రసన్నం చేసుకుంటున్నారా? అనేది తాజా అనుమానం. దీనికి ఓమ్ రౌత్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఊతమిస్తోంది. గతంలో ఓమ్ డైరెక్ట్ చేసిన తానాజీ మూవీ కూడా వివాదాస్పదమైంది. మరాఠా యోధుడు శివాజీ పాత్ర ఔన్నత్యాన్ని చిన్నబుచ్చారని ఆరోపణలొచ్చాయి. రాజకీయంగా కూడా రచ్చ జరిగింది. అటువంటివి ఆదిపురుష్ కి రిపీట్ కాకూడదని మేకర్స్ ముందస్తుగా జాగ్రత్త పడుతుండొచ్చనేది బీటౌన్లో బిగ్ న్యూస్.

(శ్రీహరి రాజా, ET డెస్క్, TV9 తెలుగు)

Also Read: Raja Raja Chora: ‘రాజా రాజా చోరా’ మూవీ ప్రీరీజ్ ఈవెంట్‌లో ఫన్నీ సీన్స్.. లైవ్

Serial Dater Sundar Ramu: ఇతనొక సీరియ‌ల్ డేట‌ర్.. ఇప్పటి వరకు 335 మంది మహిళలతో డేటింగ్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu