AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: కొమరం భీం ఓ పులితో పోరాటం.. మరోవైపు పులి బ్రిటిష్ వారిపై దాడి.. స్టోరీ ఇదే అంటూ వైరల్

RRR Movie: నందమూరి, మెగా హీరోల కలయికతో జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ . బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న రాజమౌళి..

RRR Movie:  కొమరం భీం ఓ పులితో పోరాటం.. మరోవైపు పులి బ్రిటిష్ వారిపై దాడి.. స్టోరీ ఇదే అంటూ  వైరల్
Rrr Ntr
Surya Kala
|

Updated on: Nov 04, 2021 | 2:02 PM

Share

RRR Movie: నందమూరి, మెగా హీరోల కలయికతో జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ . బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా నేపథ్యంలో షూటింగ్ కు ఆలస్యం కావడంతో సినీ ప్రేమికులను ఆకట్టుకునే విధంగా పోస్టర్స్, టీజర్స్ ని రిలీజ్ చేస్తూ.. అలరిస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో సినీ అభిమానులను అలరించడానికి ఈ సినిమా సంక్రాంతికి కానుకగా 2020 జనవరి 7 వ తేదీన రిలీజ్ కానుంది.

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్ర ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్ అన్ని ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ గ్లింప్స్ ను రూపొందించారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ పులితో పోరాడుతున్న పోస్టర్ పై ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ లోని గ్లింప్స్ లో ఎన్టీఆర్ పులితో పోరాడుతున్న సన్నివేశం హైలెట్ అయింది. అయితే ఆ పులి బ్రిటిష్ సైనికుడిపై దాడి కూడా చేస్తుంది. దీంతో ఎన్టీఆర్ కు పులి ఉన్న సంబంధం ఏమిటి.. అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తాడట. అప్పుడు ఆ పులి ఎన్టీఆర్ కు లొంగి పోయి.. నమ్మిన బంటుగా మారుతుంది.. ఈ నేపథ్యంలో ఓసారి ఎన్టీఆర్ బ్రిటిష్ వారిపై పోరాడుతుంటే.. తన యజమాని కోసం పులి బ్రిటిష్ వారితో పోరాడుతుందట. దీని వెనుక ఇంత స్టోరీ ఉంది అంటూ ఆ సన్నివేశానికి చెందిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. మరి ఈ స్టోరీ ఎంత వరకూ నిజమో చూడాలంటే.. నెక్స్ట్ ఇయర్ వరకూ ఆగాల్సిందే..

Also Read: తెలంగాణలో అసెంబ్లీలో అడుగు పెట్టనున్న ఆర్ఆర్ఆర్.. సోషల్ మీడియాలో వైరల్

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్