AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddanna : రజినీకాంత్ గారు ఇచ్చిన అతి పెద్ద ప్రశంస అదే.. ఆసక్తికర విషయం వెల్లడించిన దర్శకుడు శివ..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Peddanna : రజినీకాంత్ గారు ఇచ్చిన అతి పెద్ద ప్రశంస అదే.. ఆసక్తికర విషయం వెల్లడించిన దర్శకుడు శివ..
Shiva
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2021 | 3:11 PM

Share

Peddanna : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శివ సినిమా విశేషాలను పంచుకున్నారు.. దర్శకుడు శివ మాట్లాడుతూ.. ” చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఫస్ట్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్‌ గారితో పని చేశాను. సన్ పిక్చర్స్, సురేష్ బాబు గారి వంటి వారితో పని చేశాను. సినిమా షూటింగ్ అంతా కూడా ఎంతో సరదాగా గడచింది అన్నారు. నేను డైరెక్ట్ చేసిన విశ్వాసం సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు రజినీ కాంత్ గారు పిలిచారు. నాతో ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నావ్? అని రజినీకాంత్ గారు అడిగారు. సూపర్ స్టార్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పాను. సూపర్ స్టార్ సినిమా అంటే ఏంటి? అని నవ్వుతూ అడిగారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో కమర్షియల్‌గా ఉంటే అది సూపర్ స్టార్ సినిమా అని చెప్పాను. సరే అలాంటిదే చేద్దాం అన్నారు. ఫస్ట్ నెరేషన్‌లోనే కథ బాగా నచ్చింది. అలా సినిమా మొదలైంది అని చెప్పుకొచ్చారు శివ.

సన్ పిక్చర్స్, కళానిధి మారన్, కావ్యా మేడంలతో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీద వారికున్న నమ్మకమే నన్ను నడిపించింది. చాలా రోజుల తరువాత మళ్లీ ఫుల్ ఫిల్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది.  షూటింగ్ అంతా కూడా సరదాగానే జరుగుతూ ఉంటుంది. మంచి సీన్లు చేస్తే.. రజినీకాంత్ గారు అందరి ముందే ప్రశంసించేవారు. సినిమా బాగా తీస్తున్నాడని అన్నారు. అయితే కొంత సినిమాను ఎడిట్ చేసి చూపించాను. నా సినిమా చూసినట్టు అనిపిస్తోందని రజినీకాంత్ గారు అన్నారు. ఆ తరువాత సినిమా మొత్తం చూశారు. బయటకు వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోను. ఎంతో సంతృప్తితో ఆయన అలా చేశారు. అదే నాకు అతి పెద్ద ప్రశంస అని అన్నారు శివ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: కొమరం భీం ఓ పులితో పోరాటం.. మరోవైపు పులి బ్రిటిష్ వారిపై దాడి.. స్టోరీ ఇదే అంటూ వైరల్

Anasuya Dwali 2021: దీపావళి వెలుగుల్లో అందాల యాంకరమ్మ అనుసూయ.. ఇలా ఎప్పుడైనా చూశారా… (ఫోటొస్)

EMK: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‎తో ఎన్టీఆర్ సందడి మాములుగా లేదుగా.. దీపావళీ స్పెషల్ ఎవరు మీలో కోటీశ్వరులు.. (ఫొటోస్)

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!