AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP RRR: తెలంగాణలో అసెంబ్లీలో అడుగు పెట్టనున్న ఆర్ఆర్ఆర్.. సోషల్ మీడియాలో వైరల్

Telangana BJP RRR: దక్షిణ చలన చిత్ర రంగంలో ఈ ఏటి మేటి మెగా మల్టీస్టారర్ మూవీగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా..

Telangana BJP RRR:   తెలంగాణలో అసెంబ్లీలో అడుగు పెట్టనున్న ఆర్ఆర్ఆర్.. సోషల్ మీడియాలో వైరల్
Bjp Rrr
Surya Kala
|

Updated on: Nov 04, 2021 | 1:38 PM

Share

Telangana BJP RRR: దక్షిణ చలన చిత్ర రంగంలో ఈ ఏటి మేటి మెగా మల్టీస్టారర్ మూవీగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 3ఆర్. టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కి ఉన్న క్రేజ్ ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ కి ఉన్న క్రేజ్ రాజకీయ నాయకులకు కూడా చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఆర్ఆర్ అంటే… వెంటనేవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుకొస్తారన్న సంగతి తెలిసిందే,, ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సందడి చేస్తుంది.

తెలంగాణ బీజేపీకి సంబంధించిన ‘RRR’ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా గతంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహించేవారు. తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచారు. వీరిద్దరూ అసెంబ్లీకి కమలం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండగా.. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలవడంతో ఈ సంఖ్య రెండు నుంచి మూడుకు చేరుకుంది. టిఆర్ఎస్ కు గుడ్ చెప్పిన ఈటెల బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం బై ఎలక్షన్ కు వెళ్లారు. తన హవాని కొనసాగిస్తూ.. ఈటెల రాజేంద్ర విజయం సొంతం చేసుకున్నారు. దీంతో బీజేపీ తరఫున మూడో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణ పొలిటికల్ లీడర్స్ RRR’ అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజేంద్ర గెలుస్తారు. అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటున్నారు.

Also Read:  కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద చేసే ని వనభోజనాల.. విశిష్టత ఏమిటంటే..

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!