AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani: ఎంత బ్రతిమిలాడినా హన్సిక ఆ పని చేయనియ్యలేదు.. నటుడి షాకింగ్ కామెంట్స్

దాదాపు కుర్రహీరోలందరితో కలిసి నటించింది ఈ అమ్మడు. తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది హన్సిక. అదేవిధంగా హిందీలోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. అలాగే ఈ మద్యే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

Hansika Motwani: ఎంత బ్రతిమిలాడినా హన్సిక ఆ పని చేయనియ్యలేదు.. నటుడి షాకింగ్ కామెంట్స్
Hansika
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2023 | 9:39 AM

Share

హన్సిక మౌత్వాని.. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది ఈ భామ. ఈ సినిమాలో హన్సిక అందంతో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారును తన వైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. బబ్లీ లుక్స్ తో.. క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది హన్సిక. ఆతర్వాత ఈ అమ్మడు తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. దాదాపు కుర్రహీరోలందరితో కలిసి నటించింది ఈ అమ్మడు. తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది హన్సిక. అదేవిధంగా హిందీలోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. అలాగే ఈ మద్యే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమాల్లో కంటిన్యూ అవుతుంది. ఇదిలా ఉంటే హన్సిక గురించి ఓ నటుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.

పెళ్లి తర్వాత హన్సిక పార్ట్‌నర్ అనే సినిమాలో నటిస్తుంది. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో నటుడు రోబో శంకర్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ షూటింగ్ సమయంలో హన్సిక తనను కాలు తాకనివ్వలేదని అన్నారు. సినిమాలో హన్సిక కాలు తాకే సన్నివేశంలో ఆయన ఎంత బ్రతిమిలాడినా ఆమె తన కాలును తాకనివ్వలేదట. ఇప్పుడు ఈ కామెంట్స్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో అక్కడ ఉన్న వారు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే రోబో శంకర్ ఆరోగ్యం బాలేదని.. మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.Robo Shankar