Kantara 2: కాంతారా ప్రభంజనానికి ఏడాది.. రెండో పార్ట్‌పై కీలక అప్డేట్.. రిషబ్ శెట్టి సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది గడిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గతేడాది సెప్టెంబర్ 29న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓవరాల్‌గా కాంతారా రూ. 400 కోట్ల రాబట్టిందని తెలుస్తోంది. కాగా త్వరలోనే ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కనుంది. హీరో రిషబ్ కూడా 'కాంతారా 2' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది గడిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గతేడాది సెప్టెంబర్ 29న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓవరాల్‌గా కాంతారా రూ. 400 కోట్ల రాబట్టిందని తెలుస్తోంది. కాగా త్వరలోనే ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కనుంది. హీరో రిషబ్ కూడా ‘కాంతారా 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కాంతార సినిమాకు ప్రీక్వెల్ రెడీ అవుతుందని అధికారికంగా ప్రకటించాడు రిషబ్ శెట్టి . ఇప్పుడు ‘కాంతారా 2’ షూటింగ్‌కి సంబంధించిన కొత్త అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న కాంతారా 2 సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. అలాగే వీలైనంత వేగంగా షూటింగ్ ను పూర్తి చేసి 2024 ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. దీని గురించి హోంబలే ఫిల్మ్స్ నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా కాంతారా తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కింది. అయితే ‘కాంతారా 2′ మాత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. అయితే రిషబ్‌కి అలాంటి ఆలోచనే లేదని, లో బడ్జెట్‌తో సినిమా చేసి లాభాలు ఆర్జించాలనుకుంటున్నాడట. కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి , సప్తమి గౌడ , కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి సహా పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. ప్రతిష్ఠాత్మక హోంబాలే ఫిలింస్ కాంతార సినిమాను నిర్మించింది.
కాగా కాంతారా రిలీజ్‌ను పురస్కరించుకుని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘వరాహ రూపం’ ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనుంది.కాంతారా చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ‘వరాహ రూపం..’ పాట కూడా బాగా పాపులర్ అయింది. దీని వీడియో సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూశారు. అందుకు సమయం ఆసన్నమైంది. ఈ పాటను శనివారం (సెప్టెంబర్ 30) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని హోంబలే ఫిల్మ్స్ షేర్ చేసింది. ‘స్టేడియాల ద్వారా ప్రతిధ్వనించడం నుంచి మన పండుగ సంప్రదాయాలు, మన ఆచారాలను గుర్తుచేసే సౌండ్‌ట్రాక్‌గా మారడం వరకు.. వరాహారూపం పాట మన జీవితాలపై చెరగని ముద్ర వేసింది. సెప్టెంబర్ 30న కాంతారా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వరాహ రూపం’ని ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నాం’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది హోంబలే ఫిలింస్.
వరాహ రూపం ఫుల్ సాంగ్ ..
From echoing through stadiums to weaving into our festive traditions and becoming the cherished soundtrack of our morning rituals and wake up call, this song has left an indelible mark on our lives. Let’s come together to relive the magic and rediscover the enchantment as we… pic.twitter.com/J3IKbJd9xc
— Hombale Films (@hombalefilms) September 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




