Rhea Chakraborty : రియా చక్రవర్తితో టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సంప్రదింపులు.. త్వరలో తెలుగులో సినిమా..?
రియా చక్రవర్తి.. ఈ పేరు ఈ మధ్యకాలం లో బాగా వార్తల్లో నిలిచింది.బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం, డ్రగ్స్ కేస్ ఇలా వరుస వివాదాలు అమ్మడిని...
Rhea Chakraborty : రియా చక్రవర్తి.. ఈ పేరు ఈ మధ్యకాలం లో బాగా వార్తల్లో నిలిచింది.బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం, డ్రగ్స్ కేస్ ఇలా వరుస వివాదాలు అమ్మడిని ఉక్కిరిబిక్కిరి చేసాయి. కొద్దీ రోజులు జైలు జీవితం కూడా గడిపిన రియా ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చింది. ప్రియుడు సుశాంత్ మరణ విషాదం నుంచి ఇప్పడిప్పుడే రియా బయకు వస్తుంది. ఈ క్రమంలో రియా త్వరలో బాలీవుడ్ లో ఓ రియాలిటీ షోలో పాల్గొనబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా రియా త్వరలో టాలీవుడ్ లో సినిమా చేస్తుందంటూ ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగులో రియా తూనీగ తూనీగ అనే సినిమా చేసింది. ఈ సినిమాకు టాప్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో రియా బాలీవుడ్ కు చెక్కేసింది. ఇన్నాళ్లతర్వాత మళ్లీ తెలుగులో నటించేందుకు సిద్దమైందట. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడా నిర్మాతలు రియా చక్రవర్తిని సంప్రదించి..ఫీమేల్ లీడ్ రోల్ ఆఫర్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట.
మరిన్ని ఇక్కడ చదవండి :
నా సినిమాలు చూడటానికి సిగ్గుపడుతుంటాను.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన తమిళ స్టార్ సూర్య..