AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఆర్జీవీ హీరోయిన్.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ.. ఇక రచ్చ రచ్చే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారానికి చేరుకోవడంతో హౌస్‌లో నామినేషన్ల వేడి తీవ్ర స్థాయికి చేరింది. ప్రతి వారంలాగే ఈసారి కూడా నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, మాటల యుద్ధం ఓ రేంజ్‌లో నడిచాయి. ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్, రోహిత్, ముఖేష్, వర్షిణిల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి.

Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఆర్జీవీ హీరోయిన్.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ.. ఇక రచ్చ రచ్చే
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2026 | 5:08 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వాదనలు, టాస్కులతో రచ్చ కొనసాగుతుండగా.. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలపై ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. షోలోకి కొత్త కంటెస్టెంట్లను తీసుకొచ్చి హౌస్ లో హీట్ పెంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దక్షీ గుత్తికొండ బిగ్ బాస్ తెలుగు 10లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పేరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తుండటంతో బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

అయితే దక్షీ గుత్తికొండ ఎంట్రీపై ఇప్పటివరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది ప్రస్తుతానికి ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్‌గానే చూడాలి. దక్షీ గుత్తికొండ సినిమాల్లోకి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ చిత్రంతో అడుగుపెట్టారు. ఈ సినిమా ఆమెకు తొలి అవకాశంగా నిలిచింది. ఆ తర్వాత కూడా పలు ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ గురించి దక్షీ చేసిన వ్యాఖ్యలు కూడా వార్తల్లో నిలిచాయి. ఆర్జీవీని తొలిసారి కలిసినప్పుడు తనకు భయం వేసిందని, కానీ ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్జీవీకి సినిమా గురించి మంచి నాలెడ్జ్ ఉందని ఆమె పేర్కొన్నారు.

‘కరోనా వైరస్’ తర్వాత దక్షీ గుత్తికొండ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ నటిగా బిజీ అయ్యారు. శేఖర్ సూరి ప్రాజెక్ట్‌తో పాటు దూదేకుల తదితర చిత్రాల్లో నటించారు. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఇప్పటికే బిగ్ బాస్ 10లో వైల్డ్ కార్డు ఎంట్రీలపై భారీగా చర్చ జరుగుతోంది. తాజాగా పలువురు సెలబ్రిటీల పేర్లు ఈ లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. కొందరి పేర్లపై క్లారిటీ వస్తుండగా.. మరికొందరి ఎంట్రీలు ఇంకా ఊహాగానాల దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షీ గుత్తికొండ కూడా వైల్డ్ కార్డుగా హౌస్‌లోకి వస్తే షోకు మరింత గ్లామర్‌తో పాటు కొత్త కంటెంట్ లభించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న ఆమె.. బిగ్ బాస్ హౌస్‌లో ఎలా గేమ్ ఆడతారన్నది ఆసక్తికరంగా మారనుంది. అయితే దక్షీ నిజంగానే బిగ్ బాస్ 10లోకి అడుగుపెడతారా? లేక ఇది కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో రూమర్ మాత్రమేనా? అనేది తెలియాలంటే బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us