నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పూనకాలే. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు బాలయ్య. ఇటీవల వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా నుంచి ఆతర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమా , రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో పవర్ ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ నట సింహం. ఇక బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఆయన చాలా మంది హీరోయిన్స్ తో కలిసి పని చేశారు. పై ఫోటో గమనించారా.. ఆ ఫొటోలో బాలయ్యతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్.. బాలయ్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.. అలాగే ఆయన సరసన హీరోయిన్ గా కూడా చేసింది.
చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు , చైల్డ్ ఆర్టిస్ లుగా చేసిన వారు ఆతర్వాత వారిపక్కనే హీరోయిన్స్ గా చేశారు. అలాగే పై ఫొటోలో ఉన్న చిన్నారి కూడా బాలయ్యతో హీరోయిన్ గా కూడా చేసింది. ఇంతకు ఆమె ఎవరంటే.. పై ఫొటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రాశి. ఒకప్పుడు కుర్రాళ్లను తన అందంతో కవ్వించింది రాశి. ఇక పై ఫోటో బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ వచ్చిన బాలగోపాలుడు సినిమాలోది.
ఈ సినిమాలో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అలాగే ఇదే సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. బాలకృష్ణ హీరోగా నటించిన కృష్ణ బాబు సినిమాలో హీరోయిన్ గా చేసింది రాశి. ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రాశి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పలు సీరియల్స్ లోనూ నటించింది రాశి. అలాగే కొన్ని సినిమాల్లో అమ్మగా, అత్తగా నటిస్తుంది ఈ బ్యూటీఫుల్ హీరోయిన్.