AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Time To Die : మరోసారి వాయిదా పడ్డ ‘నో టైమ్ టు డై’

జేమ్స్ బాండ్ సినిమాల హీరో డేనియల్ క్రేగ్ గురించి సినిమా ప్రేమికులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. సంచ‌ల‌నాత్మ‌క విజయాలు న‌మోదు చేసుకున్న‌ జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియ‌ల్ ఐదుసార్లు హీరోగా న‌టించారు.

No Time To Die : మరోసారి వాయిదా పడ్డ 'నో టైమ్ టు డై'
Ram Naramaneni
|

Updated on: Oct 03, 2020 | 12:36 PM

Share

జేమ్స్ బాండ్ సినిమాల హీరో డేనియల్ క్రేగ్ గురించి సినిమా ప్రేమికులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. సంచ‌ల‌నాత్మ‌క విజయాలు న‌మోదు చేసుకున్న‌ జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియ‌ల్ ఐదుసార్లు హీరోగా న‌టించారు. తాజాగా ఇతడు జేమ్స్ బాండ్ సిరీస్ లో భాగంగా ‘నో టైమ్ టూ డై’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ సిరీస్ త‌ర్వాత జేమ్స్ బాండ్ సినిమాల‌కు డేనియల్ గుడ్‌బై చెప్ప‌నున్నారు. దీంతో ఈ సినిమా విడుద‌ల కోసం ఆడియెన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా  ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైలర్ ట్రైల‌ర్ యాక్ష‌న్ ప్రియుల‌ను ఎంత‌గానో అల‌రించింది. మ‌రోవైపు ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు‌, హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇందుక‌వ‌స‌ర‌మైన డ‌బ్బింగ్ కూడా పూర్తైపోయింది. కానీ ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది.  2021 ఏప్రిల్ 2 వరకు చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన తెలిపింది. 

కాగా ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని తొలుత గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ముహూర్తం పెట్టినా, సాధ్యపడలేదు. ఎలాగైనా స‌రే.. ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో బాండ్ అడుగుపెట్టడం పక్కా అన్నారు. కానీ క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో పరిస్థితులు కుదుటపడ్డాక నవంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2021 కి వాయిదా వేశారు. దీంతో బాండ్ సిరీస్ ఫ్యాన్స్  తీవ్ర నిరాశ చెందుతున్నారు. ‘ఆలస్యం మా అభిమానులకు నిరాశ కలిగించిందని మేము అర్థం చేసుకున్నాము, కాని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా తప్పడం లేదు’ అని మూవీ యూనిట్ పేర్కొంది.

Also Read :

చిక్కిపోయిన కీర్తి, షాకవుతోన్న ఫ్యాన్స్

చిరు ‘లూసిఫర్’​కు ముహూర్తం ఫిక్స్ !

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత