AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కిపోయిన కీర్తి, షాకవుతోన్న ఫ్యాన్స్

స్కిన్ షో ని నమ్ముకోకుండా ఓన్లీ పాత్రా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతుంది యువ హీరోయిన కీర్తి సురేష్. 'మహానటి' సావిత్రిగా మెప్పించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది ఈ సుందరాంగి‌.

చిక్కిపోయిన కీర్తి, షాకవుతోన్న ఫ్యాన్స్
Ram Naramaneni
|

Updated on: Oct 03, 2020 | 11:26 AM

Share

స్కిన్ షో ని నమ్ముకోకుండా ఓన్లీ పాత్రా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతుంది యువ హీరోయిన్ కీర్తి సురేష్. ‘మహానటి’ సావిత్రిగా మెప్పించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది ఈ సుందరాంగి‌. ఇటీవల ఓటీటీ ద్వారా ‘పెంగ్విన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె… ఇప్పుడు నితిన్ సరసన ‘రంగ్‌ దే’, సూపర్ స్టార్ రజినీ ‘అన్నాత్తె’ సినిమాలలో నటిస్తోంది. తాజాగా షూటింగ్‌ బ్రేక్‌లో తీసుకున్న ఓ వీడియోను ఆమె సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. కాఫీ తనకు కొత్త ఉత్సాహం ఇస్తుందని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కచ్చితంగా కప్పు కాఫీ తాగుతానని తెలిపింది.

అయితే.. వీడియోలో కీర్తిని చూసిన ఫ్యాన్స్ కంగుతిన్నారు. కీర్తి అందులో బాగా బరువు తగ్గిపోయి చాలా సన్నగా కనిపించడమే అందుకు కారణం. “డియర్ కీర్తి, ఏంటి ఇలా అయిపోయావ్”, “కీర్తి బరువు ఉంటేనే నువ్వు అందంగా ఉంటావ్, దయచేసి మళ్లీ బరువు పెరుగు”, “చాలా సన్నబడ్డావు, ఇలా మారిపోయావ్‌ ఏంటి?..” అంటూ రకరకాల కామెంట్లు చేశారు. అయితే కొందరు మాత్రం ఆమె ఇలా కూడా అందంగా ఉన్నారని అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేశ్‌ కొన్ని నెలలుగా బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టారు. అందుకోసం లాక్ డౌన్ లో తెగ వ్యాయామాలు చేసింది. అందుకే అంత స్లిమ్ గా మారింది.

Also Read :

ఢిల్లీలో వంగవీటి రాధా..ఏం చేస్తున్నారంటే ?

Bigg Boss 4 : ఫ్యాషన్ షోల్ చెరో లక్ష గెలుచుకున్న గంగవ్వ, అవినాష్

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత