Saakini Daakini First Look: నివేదా.. రెజీనాకు పనిష్మెంట్.. ఆకట్టుకుంటున్న శాకిని డాకిని ఫస్ట్ లుక్ పోస్టర్..

టాలెంటెడ్ నటీమణులు రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని డాకిని. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,

Saakini Daakini First Look: నివేదా.. రెజీనాకు పనిష్మెంట్.. ఆకట్టుకుంటున్న శాకిని డాకిని ఫస్ట్ లుక్ పోస్టర్..
Shakini Daakini
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 13, 2021 | 7:24 PM

టాలెంటెడ్ నటీమణులు రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని డాకిని. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 13న రెజినా పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాలోని రెజీనా, నివేదాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నివేదా, రెజీనా ఇద్దరూ మిలటరీ మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లు ఇద్దరూ కూడా మొదటిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. మిస్ గ్రానీ సినిమా యూనివర్సల్ కథ కావడంతో ఓ బేబీగా రీమేక్ చేయడంతో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని కొరియన్ మూవీ `మిడ్ నైట్ రన్నర్స్` ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి రచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..

Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..

Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..

Samantha: వివాదంలో సమంత ఐటెం సాంగ్.. కోర్టుకెక్కిన పురుషుల సంఘం.. పుష్ప పాట మగవాళ్లను కించపరిచేలా ఉందంటూ..