Samantha: వివాదంలో సమంత ఐటెం సాంగ్.. కోర్టుకెక్కిన పురుషుల సంఘం.. పుష్ప పాట మగవాళ్లను కించపరిచేలా ఉందంటూ..

హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ వివాదంలో చిక్కుకుంది. ఊ అంటావా మావా..ఉహు ఉహు అంటావా

Samantha: వివాదంలో సమంత ఐటెం సాంగ్.. కోర్టుకెక్కిన పురుషుల సంఘం.. పుష్ప పాట మగవాళ్లను కించపరిచేలా ఉందంటూ..
Samantha
Follow us

|

Updated on: Dec 13, 2021 | 6:28 PM

హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ వివాదంలో చిక్కుకుంది. ఊ అంటావా మావా..ఉహు ఉహు అంటావా మావ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ పాట ఓ యూట్యూబ్‏ను షేర్ చేస్తుంది. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‏తో పాడిన ఈ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. ఇంద్రావతి చౌహాన్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సమంత స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట్లో ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్‏తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. మీ మగబుద్ధే వంకరబుద్ది.. అంటూ సాగే లిరిక్స్ మగావాళ్లను తప్పుగా చూపించేలా ఉన్నాయని.. ఈ పాటలోని లిరిక్స్ వలన పురుషుల పై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పుష్ప సినిమాతోపాటు.. ఈ పాటలో నటించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసు పెట్టింది. పాటపై నిషేదం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది పురుషుల సంఘం.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మూవీ పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇందులో స్మగ్లర్ కమ్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్కులో బన్నీ కనిపించనుండగా.. ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ పాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. సునీల్, జబర్ధస్త్ అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Viral Video: ఆపద్బాంధవుడు.. కోతికి ఊపిరి పోసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టార్ హీరో సూర్య..

AMFI Demand on Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌పై విధించే పన్నులో ఏకరూపత ఉండాలి.. ప్రభుత్వాన్ని కోరిన ఏఎంఎఫ్ఐ

Drinking Water: మీరు మంచి నీరు ఇలా తాగితే ప్రమాదంలో పడతారు.. ఆయుర్వేదం నీరు ఎలా తాగాలని చెబుతుందో తెలుసుకోండి!