AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆపద్బాంధవుడు.. కోతికి ఊపిరి పోసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టార్ హీరో సూర్య..

ప్రస్తుత ఆధునిక కాలంలో సాటి మనిషికి సాయం చేసేవారు చాలా అరుదు.. రోడ్డుపై ప్రాణపాయ స్థితిలో ఉన్నా.. కనుకరించి

Viral Video: ఆపద్బాంధవుడు.. కోతికి ఊపిరి పోసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టార్ హీరో సూర్య..
Monkey Video
Rajitha Chanti
|

Updated on: Dec 13, 2021 | 6:07 PM

Share

ప్రస్తుత ఆధునిక కాలంలో సాటి మనిషికి సాయం చేసేవారు చాలా అరుదు.. రోడ్డుపై ప్రాణపాయ స్థితిలో ఉన్నా.. కనుకరించి సాయం చేసి ప్రాణాలు కాపాడేవారు నూటికి ఒక్కరు కనిపిస్తుంటారు. ఇక నోరు లేని మూగ జీవాల గురించి చెప్పక్కర్లేదు. తమ దారిలోకి అడ్డు వచ్చినా.. కనిపించిన విచక్షణ రహితంగా దాడి చేయడం .. ప్రాణాలు తీయడం వంటి వార్తలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ప్రాణం కోసం కొట్టుకుంటున్న జంతువులను కాపాడి మానవత్వం చాటేవారు లేకపోలేదు. తాజాగా ప్రమాదానికి గురైన కోతిని కాపాడి మంచి మనసు చాటుకున్నారు ఓవ్యక్తి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి.. అపస్మారక స్థితిలో పడివున్న కోతి ప్రాణాలను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు ఓ కారు డ్రైవర్.. తమిళనాడులోని పెరంబులూర్‏లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వివరాల్లోకెళితే.. కునామ్‏కు చెందిన డ్రైవర్ ప్రభు.. డిసెంబర్ 9న బైక్ పై వెళ్తుండగా.. ఓ చెట్టుకుంది గాయాలతో పడి ఉన్న కోతి పిల్ల కనిపించింది. కుక్కల దాడిలో ఆ కోతి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభు.. ఆ కోతిని రక్షించాడు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ కోతి గుండెను పంపింగ్ చేయడం ప్రారంభించాడు.. ఆ తర్వాత దాని నోటిలో నోరు పెట్టి ఊపిరి అందించాడు. దీంతో ఆ కోతి ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. వెంటనే ఆ కోతిని తీసుకుని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆ కోతికి చికిత్స అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఆ కోతిని అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధ రమేన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తమిళ్ స్టార్ హీరో సూర్య తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ.. నమస్కారిస్తున్న ఎమోజీని షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఆ వ్యక్తి అపద్భాందవుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..

Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..

Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..