Viral Video: బార్‌కొచ్చి గ్లాసును పగల గొట్టిన దెయ్యం!.. వైరల్‌గా మారిన CCTV ఫుటేజ్ వీడియో..
ఇటీవల దెయ్యాలకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వాటిని చూస్తోంటే నిజంగా దెయ్యాలున్నాయేమో అని అనిపించేలా ఉంటున్నాయి
ఇటీవల దెయ్యాలకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వాటిని చూస్తోంటే నిజంగా దెయ్యాలున్నాయేమో అని అనిపించేలా ఉంటున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్రిటన్‌లోని ఓ పబ్‌లో దెయ్యం ఉందని.. అది బీరు గ్లాస్ కూడా పగులగొట్టిందన్న ఓ వీడియో నెట్టింట్లో బాగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ బార్‌కు ఏకంగా హాంటెడ్ బార్ అని పేరు కూడా పెట్టేశారు. తాజాగా మరోసారి అలాంటి విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రిటన్‌లోని సౌత్ వ్రాక్సాల్, విల్ట్‌షైర్‌లో ఉన్న లాంగ్ ఆర్మ్స్ బార్ సీసీటీవీ పుటేజీలో రికార్డైన వీడియో ప్రకారం… బార్‌లోని టేబుల్‌కి ఇరువైపులా ఓ మహిళ, వ్యక్తి కూర్చుని మాట్లాడుకుంటుంటారు. కాసేపటి తర్వాత మహిళ అక్కడ నుంచి లేచి పక్కకు వెళ్లిపోతుంది. ఆ వెంటనే టేబుల్ షెల్ఫ్‌లో ఉన్న ఓ గ్లాస్ దానంతట అదే కింద పడుతుంది.
అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో బార్‌లో ఉన్నవారు ఒక్క క్షణం ఉలిక్కిపడతారు. మహిళ అయితే ఆ షాక్ నుంచి తేరుకోలేక కొద్దిసేపు అలాగే నిశ్శబ్ధంగా ఉండిపోతుంది. టేబుల్‌కి అవతల పక్క ఉన్న వ్యక్తి ఆమెకు ధైర్యం చెబుతాడు. ఆతర్వాత షెల్ఫ్‌లో ఏమైనా ఉందేమోనని.. చేయి పెట్టి చూస్తాడు. కానీ వారికి ఏం కనిపించదు.. కనీసం తగలదు కూడా. ‘జార్జ్ అనే దెయ్యం.. పబ్‌లో రోజూ రాత్రి మాతో ఆడుకుంటున్నాడు. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది’ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఈ బార్‌లో ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదని బార్‌లో పనిచేసే సిబ్బంది, అక్కడకు వచ్చే కస్టమర్లు చెబుతున్నారు. తాము వంటగదిలో పని చేస్తుండగా.. సడెన్‌గా ఎవరో వచ్చి తలుపుకు తాళం వేస్తారని, కుర్చీలు, టేబుల్స్ కదిల్చినట్లు శబ్దాలు వస్తాయని బార్ సిబ్బంది తెలిపారు. ఈ సంఘటనలు చూసి మొదట్లో తాము భయపడ్డామని.. అయితే రానురాను అలవాటైపోయిందని వారు పేర్కొన్నారు.
So #George our resident ghost? is playing up tonight, keep watching the bottom shelf??????? pic.twitter.com/PnoWqwMvjY
— The Longs Arms (@TheLongsArms) December 4, 2021
Also Read:
Viral Photo: మీరు ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీకంటే తోపు ఎవ్వరూ లేరు.. ట్రై చేయండి!
Covid Vaccine: 24 గంటల్లో ఏకంగా 10 సార్లు కొవిడ్ టీకా తీసుకున్నాడు.. చివరికి ఏం జరిగిందంటే..
Kareena Kapoor: సెలబ్రెటీలను వదలని మహామ్మారి.. కోవిడ్ బారీన పడిన కరీనా కపూర్, అమృతా అరోరా..