Kalki 2898 AD: ప్రభాస్ కోసం స్పెషల్ గన్స్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

ఇప్పటికే 500కోట్లకు పైగా వసూల్ చేసింది సలార్ సినిమా. డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది సలార్. సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సలార్ సినిమా మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి.

Kalki 2898 AD: ప్రభాస్ కోసం స్పెషల్ గన్స్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
Kalki 2898 Ad
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2023 | 4:45 PM

సలార్ సినిమాతో భారీ విజయన్ని అందుకున్నాడు ప్రభాస్. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ హిట్ అందుకున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 500కోట్లకు పైగా వసూల్ చేసింది సలార్ సినిమా. డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది సలార్. సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సలార్ సినిమా మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే కల్కి అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ‘కల్కి 2898 ఏడీ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొను హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన చేసిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా కల్కి సినిమా కోసం స్పెషల్ గా గన్స్ ను తయారు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కల్కి సినిమా కోసం స్పెషల్ గా గన్స్ ను తాయారు చేయడం చూపించారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.