మాస్ మహారాజా రవితేజ ఇటీవల ధమాకా సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చినఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఇక ఓ వైపు ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆయన.. ఇక సంక్రాంతికి కూడా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. తెలుగుతోపాటు.. హిందీలోనూ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. తాజాగా పూనకాలు లోడింగ్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
ఈ మాస్ పాటను డిసెంబర్ 31 హైదరాబాద్ సంధ్య థియేటర్ లో అభిమానుల మధ్య విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందులో మెగాస్టార్. రవితేజ కలిసి స్టెప్పులేసినట్లుగా ఇటీవల విడుదలైన పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ పాట్ గురించి తన ట్విట్టర్ వేదికగా ఆసక్తిరక పోస్ట్ చేశారు రవితేజ. పూనకాలు లోడింగ్ సాంగ్ తన సినీ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ అని.. అలాగే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ ఎప్పటికీ మెమొరబుల్ గా తన జీవితంలో నిలిచిపోతుందంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం మాస్ మాహారాజా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత చిరు ఆ లుక్ లో కనిపించనుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ, చిరు సినిమాలు పోటీ పడనున్నాయి.
A song that’s truly special & undoubtedly memorable for me❤️
What a joy dancing beside annaya @KChiruTweets, Thank you @dirbobby for making it happen :))
Enjoy our #PoonakaaluLoading from #WaltairVeerayya?
– https://t.co/xKOZs40m45@ThisIsDSP @Sekharmasteroff @MythriOfficial pic.twitter.com/eE7JT8TDjg
— Ravi Teja (@RaviTeja_offl) December 30, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.