AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: ఆసుపత్రి నుంచి రవితేజ డిశ్చార్జ్.. ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మాస్ మాహారాజా..

ఆ గాయాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది కాస్త మరింత తీవ్రమైంది. దీంతో శుక్రవారం ఆయన ఆసుపత్రిలో చేరగా.. శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కుడి చేతికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

Raviteja: ఆసుపత్రి నుంచి రవితేజ డిశ్చార్జ్.. ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మాస్ మాహారాజా..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2024 | 1:41 PM

Share

మాస్ మాహారాజా రవితేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. అలాగే తన ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించాడు. తనకు సర్జరీ సాఫీగా సాగిందని.. విజయవంతంగా పూర్తైందని.. దీంతో ఆసుపత్రి నుంచి తాను డిశ్చార్జ్ అయినట్లు ట్వీట్ చేశాడు. అందరి ఆశీర్వాదాలు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. “ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే సెట్ లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. దీంతో రవితేజ ట్వీట్ పై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ గెట్ వెల్ సూన్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే మిస్టర్ బచ్చన్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు రవితేజ. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మాస్ మాహారాజా. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన షూటింగ్ లో స్వల్పంగా గాయపడ్డారు. ఆ గాయాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది కాస్త మరింత తీవ్రమైంది. దీంతో శుక్రవారం ఆయన ఆసుపత్రిలో చేరగా.. శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కుడి చేతికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రవితేజ #RT75 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతుంది. ఈ క్రమంలోనే గురువారం ఆయనకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్. కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!