AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఎన్నో గాయాలు.. భావోద్వేగ క్షణాలు.. ఇప్పటికీ ఆరోజు ప్రత్యేకమే.. రష్మిక పోస్ట్..

ప్రస్తుతం యానిమల్ పార్క్, పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తాను నటించిన ఓ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తైన ప్రేక్షకులు ఇప్పటికీ తనను లిల్లీగానే గుర్తుపెట్టుకున్నారని.. ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Rashmika Mandanna: ఎన్నో గాయాలు.. భావోద్వేగ క్షణాలు.. ఇప్పటికీ ఆరోజు ప్రత్యేకమే.. రష్మిక పోస్ట్..
Rashmika, Vijay
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2024 | 8:06 AM

Share

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఫుల్ బిజీ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. విభిన్నమైన కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మారిపోయింది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ప్రస్తుతం యానిమల్ పార్క్, పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తాను నటించిన ఓ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తైన ప్రేక్షకులు ఇప్పటికీ తనను లిల్లీగానే గుర్తుపెట్టుకున్నారని.. ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన పాత్రను అంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా..? అదే డియర్ కామ్రేడ్.

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి రివ్యూస్ అందుకుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. గీతా గోవిందం తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఇదే. ఇందులో రష్మిక లిల్లీ పాత్రలో కనిపించి అలరించారు. ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు.. ఈ సందర్బంగా తన ఇన్ స్టాలో డియర్ కామ్రేడ్ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. “డియర్ కామ్రేడ్ సినిమాను అభిమానించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికీ దీనిని ఆదరిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. స్క్రిప్ట్ నెరేషన్ తో మొదలైన ఈ ప్రయాణంలో నెలలపాటు క్రికెట్ ట్రైనింగ్, గాయాలు, నవ్వులతో సాగిన షూట్.. చిత్రీకరణ పూర్తైన రోజు భావోద్వేగ క్షణాలున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను లిల్లీగానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం. భరత్, విజయ్ దేవరకొండతోపాటు చిత్రయూనిట్ కు ధన్యవాదాలు” అంటూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లీ పాత్రలో నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఈ కన్నడ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు