AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: అయ్యా బాబోయ్.. అప్పుడు ఎంత క్యూట్‏గా ఉందో.. రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో చూశారా..?

శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీకి అటు హిందీ నుంచి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ 2 చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది. అయితే రష్మిక ఫస్ట్ మూవీ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది కిరిక్ పార్టీ. కానీ ఈ అమ్మడు మొదటి సినిమా పేరు గోపిలోల. అయితే ఈ సినిమా ఆలస్యంగానే విడుదలవుతుంది..

Rashmika Mandanna: అయ్యా బాబోయ్.. అప్పుడు ఎంత క్యూట్‏గా ఉందో.. రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో చూశారా..?
Rashmika
Rajitha Chanti
|

Updated on: Oct 02, 2024 | 3:38 PM

Share

నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీకి అటు హిందీ నుంచి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ 2 చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది. అయితే రష్మిక ఫస్ట్ మూవీ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది కిరిక్ పార్టీ. కానీ ఈ అమ్మడు మొదటి సినిమా పేరు గోపిలోల. అయితే ఈ సినిమా ఆలస్యంగానే విడుదలవుతుంది..

ప్రస్తుతం రష్మిక తన తొలి సినిమా ఆడిషన్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. గోపిలోల సినిమా కోసం రష్మిక ఇచ్చిన ఫస్ట్ ఆడిషన్ వీడియో చూసి ఇప్పుడు నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అందులో ఆమె యాక్టింగ్, మాటలు, అల్లరి నవ్వులు తెప్పి్స్తున్నాయి.. అలాగే డ్యాన్స్ కూడా అదరగొట్టింది. డైలాగ్ చెప్పాలని డైరెక్టర్ కోరగా.. ఫన్నీగా చెప్పేసింది. తన వయసు 19 ఏళ్లు అని.. అప్పుడు కాలేజీ చదువుతున్నానని.. హైట్ 5.5 ఉంటుందని చెప్పుకొచ్చింది. తన పర్సనల్ వివరాలు చెప్పి డాన్స్ కూడా అదరగొట్టేసింది.

ఇవి కూడా చదవండి

రష్మిక ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన గోపిలోల సినిమా అక్టోబర్ 4న విడుదల కాబోతుంది. ఇందులో రష్మిక నటించాల్సిన పాత్రలో మిన్ కె చంద్రను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా నెట్టింట రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ