Rashmika Mandanna: రష్మికకు షాక్.. మరో డీప్ ఫేక్ వీడియో కలకలం.. కఠిన చర్యలు తీసుకోవాలంటోన్న ఫ్యాన్స్
యానిమల్ సినిమా విజయానందంలో ఉన్న రష్మికకు మరోసారి షాకిచ్చారు దుండగులు. మరోసారి ఆమె డీప్ ఫేక్ వీడియోని నెట్టింట రిలీజ్ చేశారు. గతంలో వీడియో లాగానే ఇందులోనూ లిఫ్ట్‌లోక వస్తోన్న ఒకరి ఫేస్‌ను మార్ఫింగ్ చేసి ఈ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట దుమారం రేపుతుంది.

ప్రస్తుతం రష్మిక మందన్నకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె నటించిన యానిమల్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ విడుదలై రెండు రోజులు గడుస్తున్నాచాలా చోట్ల మంచి వసూళ్లు రాబడుతోంది. మూడో వారాంతంలో మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ నిపుణులు. అయితే యానిమల్ సినిమా విజయానందంలో ఉన్న రష్మికకు మరోసారి షాకిచ్చారు దుండగులు. మరోసారి ఆమె డీప్ ఫేక్ వీడియోని నెట్టింట రిలీజ్ చేశారు. గతంలో వీడియో లాగానే ఇందులోనూ లిఫ్ట్‌లోక వస్తోన్న ఒకరి ఫేస్‌ను మార్ఫింగ్ చేసి ఈ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట దుమారం రేపుతుంది. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రష్మికకి ఇలాంటివి వరుసగా ఎదురు కావడం బాధాకరమంటున్నారు. కాగా దీనిపై ఇప్పటివరకు రష్మిక కానీ ఆమె టీమ్ కానీ స్పందించలేదు.
ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న చాక్లెట్ కలర్ బాడీకాన్ గౌనులో పోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కొద్ది గంటల్లోనే ఈ ఫోటోకు 13 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 6 వేలకు పైగా కామెంట్స్ చేస్తూ అభిమానులు తమ అభినందనలు తెలిపారు. ఈ ఫోటో అభిమానుల పేజీల్లో వైరల్‌గా మారింది. రష్మిక మందన్నకు ఫోటో షూట్‌లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. సినిమా పనుల్లో ఖాళీ సమయాల్లో తరచూ ఫొటోషూట్‌లు చేస్తుంటుందీ అందాల తార. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అందుకు తగ్గట్టుగానే ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. యానిమల్ సినిమా విజయం సాధించడంతోఆమెకు క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో 4 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక మందన్న ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాల్లో నటిస్తోంది.
రష్మిక మందన్నా లేటెస్ట్ ఫొటో షూట్
View this post on Instagram
కశ్మీర్ వెకేషన్ లో రష్మిక.
View this post on Instagram
యానిమల్ ‘గీతాంజలి’ నా మనసుకు దగ్గరైంది..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








