AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఏం రోగం వచ్చింది వీడికి.. అమర్‌ని ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేసిన శివాజీ

ఇప్పటివరకు ఓవరాల్ పెర్ఫామెన్స్ బట్టి 60 నిమిషాల ఎపిసోడ్‌లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులో కారణాలు చెప్పాలి అని చెప్పాడు బిగ్ బాస్. అలాగే మిగిలిన వాళ్ళకు కూడా టైమ్ కార్డ్ ఇచ్చి వాళ్ళు ఎందుకు ఆ టైం కు అర్హులో చెప్పాలి అని అన్నాడు బిగ్ బాస్. ముందుగా అర్జున్ ఈ టాస్క్ ను మొదలు పెట్టాడు. అర్జున్ తన మేడలో 10 బోర్డు ధరించి.. నేను ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కువ కనిపించకపోయినా టాస్క్ ల్లో బాగానే కనిపించా.. కాబట్టి పది నిముషాలు అనుకుంటున్నా అని అన్నాడు.

Bigg Boss 7 Telugu: ఏం రోగం వచ్చింది వీడికి.. అమర్‌ని ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేసిన శివాజీ
Bigg Boss 7
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2023 | 7:59 AM

Share

బిగ్ బాస్ చివరి వారంలోనూ హౌస్ మేట్స్ ను వదలడం లేదు. నిన్నటి వరకు ఎమోషనల్ జర్నీ చూపించి ఏడిపించిన బిగ్ బాస్. తాజాగా హౌస్ మేట్స్ మధ్య ఓ చిన్న చిచ్చు పెట్టాడు. ఇప్పటివరకు ఓవరాల్ పెర్ఫామెన్స్ బట్టి 60 నిమిషాల ఎపిసోడ్‌లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులో కారణాలు చెప్పాలి అని చెప్పాడు బిగ్ బాస్. అలాగే మిగిలిన వాళ్ళకు కూడా టైమ్ కార్డ్ ఇచ్చి వాళ్ళు ఎందుకు ఆ టైం కు అర్హులో చెప్పాలి అని అన్నాడు బిగ్ బాస్. ముందుగా అర్జున్ ఈ టాస్క్ ను మొదలు పెట్టాడు. అర్జున్ తన మేడలో 10 బోర్డు ధరించి.. నేను ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కువ కనిపించకపోయినా టాస్క్ ల్లో బాగానే కనిపించా.. కాబట్టి పది నిముషాలు అనుకుంటున్నా అని అన్నాడు. ఆతర్వాత అమర్ మేడలో 20 బోర్డు వేశాడు. ఆతర్వాత శివాజీ మేడలో 15 బోర్డు,ప్రియాంకకి 7, యావర్‌కి 5, ప్రశాంత్‌కి 3 బోర్డులు ఇచ్చాడు అర్జున్.

ఆతర్వాత అమర్ దీప్ తన మేడలో 15 బోర్డు వేసుకున్నాడు. అలాగే అర్జున్‌కి 3, ప్రియాంకకి 7, యావర్‌కి 5, ప్రశాంత్‌కి 10, శివాజీకి 20 ఇచ్చాడు అమర్. ఎందుకు 5 నిమిషాలే ఇచ్చావని యావర్ ప్రశ్నించించాడు.. దాని అమర్ 2 మినిట్స్ జిమ్, 2 మినిట్స్ గేమ్, 1 మినిట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ సమాధానం చెప్పాడు. అటు ప్రియాంక కూడా తనకు 7 ఇచ్చినందుకు హర్ట్ అయ్యింది.

ఆతర్వాత శివాజీ తన మేడలో 5 బోర్డు వేసుకున్నాడు. అలాగే అమర్ మేడలో 3 నిమిషాల బోర్డు వేసి నువ్వు  ఈ 2 వారాలు కాకుండా ముందు ఏం చేసినా నా దృష్టిలో ఏం చేయలేదనే ఫీలింగ్‌ ఉంది. నువ్ బాగా ఆడగలవు కానీ ఆడలేదు. అని అన్నాడు. దానికి అమర్ మరీ మూడు తీసుకోలేకపోతున్నా అన్న అని అన్నాడు అమర్. ఎందుకు వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉండి.. ఏం రోగం వచ్చింది వీడికి.. సరిగా ఆడటానికి అని నేను అనుకునేవాడిని. కొన్ని సార్లు నువ్వు నెగెటివ్ కంటెంట్ కోసం వెళ్లినట్లు అనిపించింది అని శివాజీ అన్నాడు. ఇక 10 నిమిషాలు ప్రియాంకకి, అర్జున్‌కి 7 ఇచ్చి. 15, 20 బోర్జులు ప్రశాంత్, యావర్ చేతిలో పెట్టేసి మీకు నచ్చింది తీసుకోండి అని అన్నాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్