AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: దాని కోసం నేను పెద్ద త్యాగమే చేశాను.. అసలు విషయం చెప్పిన రష్మిక మందన్న

స్టార్ హీరోయిన్ రష్మిక టాలీవుడ్ బాలీవుడ్ అని తేడాలు లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. హీరోలకు మించిన క్రేజ్ తో ఈ అమ్మడు రాణిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే క్లిక్ అయిన రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి.. ఆతర్వాత తెలుగులో చలో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక ఇప్పుడు పుష్ప తో దేశాన్నే ఊపేస్తోంది.

Rashmika Mandanna: దాని కోసం నేను పెద్ద త్యాగమే చేశాను.. అసలు విషయం చెప్పిన రష్మిక మందన్న
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2025 | 10:23 AM

Share

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా అయ్యింది. తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆతర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ ఫెమస్ అయ్యింది. నటి రష్మిక మందన అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇక ఇప్పుడు రష్మిక రష్మిక మంధాన లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో చావా అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ-సాయిబాయి దంపతుల పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజు జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఛత్రపతి శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా, శంభాజీ భార్య పాత్రలో నటి రష్మిక మందన్న నటిస్తుంది. ఈ నేపథ్యంలో నటి రష్మిక క్యారెక్టర్ పోస్టర్ ఇంటర్నెట్‌లో విడుదలై వైరల్ అవుతోంది. రష్మిక 5 ఏప్రిల్ 1996న కర్ణాటకలో జన్మించింది. 2016లో రష్మిక ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలైన సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే, ఈ చిత్రంలో తన నటనకు గాను నటి రష్మికకు ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది.

ప్రస్తుతం రష్మిక తెలుగు తమిళ్ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. కాగా ఇటీవల రష్మిక జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రష్మిక కాలికి గాయమైంది. దీంతో చావా ట్రైలర్ లాంచ్ కు వీల్ చైర్ లో వచ్చి అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమాల్లో విజయం సాధించేందుకు తన కుటుంబంతో గడిపే సమయాన్ని త్యాగం చేశానని తెలిపింది. కుటుంబానికి సమయం ఇవ్వకుండా సినిమాలు చేస్తూ నన్ను నేను కాంప్రమైజ్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది రష్మిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్