Shamshera Trailer: అదరగొట్టిన రణబీర్.. ఆకట్టుకుంటోన్న ‘షంషేరా’ ట్రైలర్
ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిపోయింది. బాహుబలి , కేజీఎఫ్, పుష్ప సినిమాలు పాన్ ఇండియా రేంజ్ ను అమాంతం పెంచేశాయి. విభిన్నమైన కంటెంట్ తో సినిమ తెరకెక్కిస్తే వెంటనే ఆ సినిమాను పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిపోయింది. బాహుబలి , కేజీఎఫ్, పుష్ప సినిమాలు పాన్ ఇండియా రేంజ్ ను అమాంతం పెంచేశాయి. విభిన్నమైన కంటెంట్ తో సినిమ తెరకెక్కిస్తే వెంటనే ఆ సినిమాను పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అన్ని సినిమా ఇండస్ట్రీలు పాన్ ఇండియా రేంజ్ ను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) కూడా పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ కు రెడీ చేశాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమా రాబోతుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాలో అమితాబ్ , నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు రణబీర్.
‘షంషేరా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు లవర్ బాయ్ రణబీర్. 1871 నేపథ్యంలో ఈ మూవీని బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని ఇటీవల మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రణబీర్ బందిపోటుగా కనిపించనున్నాడు. విజువల్స్ , స్క్రీన్ ప్లే అద్భుతంగా అనిపించాయి. మిథూన్ నేపథ్య సంగీతం సినిమాని ఓ స్టాండర్డ్స్ లో నిలబెట్టి అంచనాల్ని పెంచేశాయి. ఈ సినిమా జూలై 22న హిందీతో పాటు తమిళ తెలుగు భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.