AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakka Commercial: మ్యాచో హీరో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో

మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈ సారి పక్కా కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.

Pakka Commercial: మ్యాచో హీరో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో
Pakka Commercial
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2022 | 3:23 PM

Share

మ్యాచో హీరో గోపీచంద్(Gopichand) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్(Pakka Commercial). చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈ సారి పక్కా కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో  జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా వస్తున్నపక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్  పెంచారు మేకర్స్.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మేజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

జూన్ 26న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారని తెలుస్తోంది. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారట. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా