Rajinikanth: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్.?
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిగా రజిని మురగదాస్ దర్శకత్వంలో దర్భార్ సినిమా తో హిట్ అందుకున్నారు. ఆతర్వాత వచ్చిన అన్నత్తే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిగా రజిని మురగదాస్ దర్శకత్వంలో దర్భార్ సినిమా తో హిట్ అందుకున్నారు. ఆతర్వాత వచ్చిన అన్నత్తే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా రజినీకాంత్ 169 పైనే ఆశలు పెట్టుకున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నెల్సన్. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళ్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే రజనీకాంత్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
పా.రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ 170 వ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో పా.రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమా చేశారు సూపర్ స్టార్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో రజినీకాంత్ చాలా స్టైలిష్ గా కొత్తగా కనిపించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా రజినీకాంత్ కు అదిరిపోయే కథను వినిపించాడట రంజిత్.. కథ నచ్చడంతో సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరో వైపు లోకేష్ కనగ రాజ్ కూడా రజినీ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ముందుగా వస్తుందో చూడాలి.