Ramayanam : రామాయణం సినిమాకు అనుకోని అడ్డంకులు.. ఆగిపోయిన షూటింగ్
ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ‘రామాయణం’ సినిమా షూటింగ్ మొదలైంది. అలాగే షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రణబీర్, సాయి పల్లవి అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ‘రామాయణం’ సినిమా షూటింగ్ మొదలైంది. అలాగే షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రణబీర్, సాయి పల్లవి అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమా ఖచ్చితంగా సంచలన విజయం సాదిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు ఉహించాయి సమస్య ఎదురైంది.
ఇది నిజంగా ఫ్యాన్స్ షాక్ అయ్యే వార్తే.. రామాయణం సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది రామాయణం మూవీ నిర్మాత కాపీరైట్ నిబంధనను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని అంటున్నారు. ‘రామాయణం’ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ‘అల్లు మంతెన మీడియా వెంచర్స్ ఎల్‌ఎల్‌పి’ సంస్థ ఈ చిత్ర బృందానికి నోటీసు పంపింది. దాని ప్రకారం ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘రామాయణం’ సినిమా నిర్మాతలు స్క్రిప్ట్‌కి సంబంధించిన కొన్ని హక్కులను కొనుగోలు చేశారు. ప్రక్రియ పూర్తి కాకపోవడంతో నోటీసు పంపారు.
‘రామాయణం’ చిత్రబృందానికి నోటీసు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అయితే గత వారం నుంచి మూవీ షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. లీగల్ ఇష్యుస్ పరిష్కారమైన తర్వాతే షూటింగ్ కొనసాగించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. రామాయణం సినిమాలో చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. షూటింగ్‌కి సంబంధించి, ముందుగా డేట్స్ కూడా ఇచ్చారు స స్టార్ యాక్టర్స్. అయితే ఇప్పుడు షూటింగ్ ఆగిపోవడంతో డేట్స్ అన్నీ మారనున్నాయి. దీంతో ఆర్టిస్టులకు, నిర్మాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవిలతో పాటు యష్, సన్నీడియోల్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.