Kalki 2898 AD: నేడే కల్కీ మెగా ఈవెంట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సిద్దమా..?

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్‌ మొదలు కాబోతున్నాయి. ఇండియాలో తొలి ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది యూనిట్‌. ఈ ఈవెంట్‌లో బుజ్జి అనే సూపర్ కార్‌ను ఆడియన్స్‌ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌తో మొదలు పెట్టి ప్రమోషన్‌ స్పీడు పెంచేలా ప్లాన్ చేస్తోంది వైజయంతి టీమ్‌.

Kalki 2898 AD: నేడే కల్కీ మెగా ఈవెంట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సిద్దమా..?
Prabhas
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2024 | 10:49 AM

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్‌ ఫిక్షన్‌ పాంటసీ డ్రామా కల్కి 2898 ఏడీ. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్లోబల్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ప్రభాస్‌. మైథాలజీకి సైన్స్‌ను లింక్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కల్కి 2898 ఏడీ కథను రూపొందించారు నాగీ. శ్రీ కృష్ణుడు మరణించిన ఐదు వేల ఏళ్ల తరువాత జరిగే కథ కాబట్టే టైటిల్‌లో 2898 ఏడీ అనే నెంబర్‌ను చేర్చారు. కేవలం టైటిల్‌ విషయంలోనే కాదు క్యారెక్టర్స్ విషయంలో మైథలాజికల్ రిఫరెన్స్‌లు ఉండేలా చూసుకుంటున్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను అశ్వథ్థామగా చూపించిన నాగీ, ప్రభాస్‌ను ప్రపంచాన్ని కాపాడే కల్కి రూపంగా పరిచయం చేయబోతున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌ నెగెటివ్ రోల్‌లో నటించటం, తొలిసారిగా దీపిక పదుకోన్‌ సౌత్‌ టీమ్‌తో కలిసి వర్క్ చేయటం ఈ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇక ఈవెంట్‌ విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ అంతా పాల్గొనబోతున్నారు. భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగుతో పాటు దేశ విదేశీ భాషల్లో మూవీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న అవెంజర్స్‌ తరహాలో కల్కి కూడా ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రయూనిట్‌.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి