
దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాట పర్వం(Virata Parvam). ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో డీసెంట్ హిట్‌ను అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
విరాట పర్వం ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. సాయి పల్లవి మరోసారి తన నటనతో కట్టిపడేస్తుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. రానా మరోసారి పవర్ ఫుల్ పాత్రతో ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి భావజాలను ఇష్టపడి.. అతడిని ప్రేమించే యువతి వెన్నెలగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా కనిపించనున్నాడు. సాయిపల్లవితో పాటు ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ విరాట పర్వం.