Virata Parvam Movie: నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం ఎమోషన్ రగిలించే ‘విరాటపర్వం’

దగ్గుబాటి యంగ్ హీరో రానా ఇటీవల అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అడవి మనిషిగా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు.

Virata Parvam Movie: నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం ఎమోషన్ రగిలించే 'విరాటపర్వం'
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2021 | 5:07 PM

Virata Parvam Movie: దగ్గుబాటి యంగ్ హీరో రానా ఇటీవల అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అడవి మనిషిగా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతర్వాత వేణు ఉడుగుల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రానా. విరాటపర్వం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. అలాగే ఈ సినిమానుంచి విడుదలైన కొలొకోలమ్మ అనే పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న అరణ్య సినిమా బాక్సాఫిస్ దగ్గర కాస్త నిరాశపరిచింది. కానీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు రానా. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాడు రానా.సురేష్ బాబు సమర్పకులుగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరాట పర్వం సినిమాలో రానా నక్షలైట్ గా కనిపించనున్నాడు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం ఎమోషన్ రగిలించేదిగా సినిమాను తెరకెక్కించాడట దర్శకుడు వేణు ఉడుగుల. అదేవిధంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను ఏప్రిల్ నెల మొదటివారం నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారట. ఈ చిత్రంలో ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- ఈశ్వరి రావు- జరీనా వహాబ్ – నివేదా పెథురాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా  ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘మరిన్ని ఇక్కడ చదవండి :

ఇప్పటికే నాకు మూడు, నాలుగుసార్లు పెళ్లి చేసారు… ఆసక్తికర విషయాలను చెప్పిన కీర్తి సురేష్..

రామ్ చరణ్, శంకర్ సినిమాకు షాక్.. సినిమా ఆపేయాలంటూ కోర్డులో కేసు.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..

OLX Schame : Olx లో మోసపోయిన యాంకర్ వర్షిణి ఫ్రెండ్.. వీడియో షేర్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.