Bheemla Nayak: ఈ పాట విని సిరివెన్నెల ఆశీర్వదించారు.. “భీమ్లానాయక్” అడివి తల్లి పాట గురించి రామజోగయ్య..

Bheemla Nayak: ఈ పాట విని సిరివెన్నెల ఆశీర్వదించారు.. భీమ్లానాయక్ అడివి తల్లి పాట గురించి రామజోగయ్య..
Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'.

Rajeev Rayala

|

Dec 05, 2021 | 4:49 PM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు , టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. గీతం ప్రారంభంలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కు నివాళి గా ఆయన చిత్రం అందులో ‘మీ ఉచ్ఛ్వాసం కవనం…మీ నిశ్వాసం గానం…మీ జ్ఞాపకం అమరం‘ అన్న వాక్యాలు కనిపిస్తాయి. ఆ తరువాత పాట ప్రారంభం అవుతుంది.

‘భీమ్లా నాయక్‘లో ఓ కీలక సందర్భంలో భాగంగా ఈ పాట రానుంది . ఆవేదనా భరితంగా సాగిన తమన్ స్వరాలు ఓ వైపుగుండెల్ని పిండేస్తే, మరో వైపు దుర్గవ్వ, సాహితి చాగంటిల గళంలో హృదయం బరువెక్కుతుంది. రెండు నిమిషాల ముప్ఫై రెండు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. పవన్ కళ్యాణ్, రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ లు కనిపిస్తుంటారు. ఈ పాట గురించి రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..” ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తగువు లాడుకుంటుంటే చూడలేని కన్నతల్లి యొక్క మనోవేదన ఏమిటన్నది ఈ పాట సారాంశం అన్నారు. ఇక్కడ కన్నతల్లి ఎవరో కాదు. ‘అడవి తల్లి‘. ఇలాంటి ఒక భావన ఈ పాటలో కావాలని దర్శకులు చెప్పిన వెంటనే నేను, సంగీత దర్శకుడు తమన్ ఆలోచనలు సాగిస్తున్న దశలో, గుండెల్ని రంపపు కోతకు గురి చేస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక శబ్దాన్ని వినిపించారు. దానికి అనుగుణంగా నేను పదాలు కూర్చాను. అలా మా మాటల మధ్యలోనే పాట సిద్ధ మయింది అన్నారు. ఆవెంటనే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చిత్ర దర్శకుడు సాగర్, చినబాబు గార్లకు వినిపించటం, వారికి ఎంత గానో నచ్చటం, పాట రికార్డ్ అవ్వటం జరిగింది. దీనికి అచ్చంగా పల్లె తనం తొణికిస లాడే గొంతులు సరితూగాయి. నా అదృష్టం ఏమిటంటే ఈ పాట విడుదల అవకముందే, రాసిన వెంటనే మా గురువు గారు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గార్కి వినిపించటం జరిగింది. పాట విన్న వెంటనే ఈ పాట నేనే రాశానా అన్న భావన, ఈ పల్లె భాష నాకెలా తెలుసు అన్న ఆశ్చర్యం నీకు కలగలేదా..? అంత బాగా రాసావు అంటూ మెచ్చుకుని ఆయన ఆశీర్వదించడం ఒకటైతే, చిత్ర కథాను సారం ఓ కీలక సందర్భంలో, అందరినీ ఒక మంచి భావోద్వేగానికి లోనయ్యే లాంటి ఈ గీతం రచించే అవకాశం నాకు రావటం మరో అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: ‘అఖండ’పై అన్షుల్ సక్సేనా ప్రశంసలు.. ‘జై బాలయ్య’ అని కామెంట్..

Pushpa Movie: పుష్ప మేకింగ్‌ వీడియోను చూశారా.? బన్నీ ఇచ్చిన మెసేజ్‌ మాత్రం అదుర్స్‌..

Akira Nandan: తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu