Skanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన రామ్ పోతినేని మాస్ మసాలా మూవీ స్కంద.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే
ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలు చాలా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా మంది థియేటర్స్ లో సినిమా చూడటాని కంటే ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక కొన్ని సినిమాలు వారం రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇక ఓటీటీలో ఈ రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సినిమాలు రిలీజ్ అయిన నెల రోజుల వ్యవధిలో సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలు చాలా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా మంది థియేటర్స్ లో సినిమా చూడటాని కంటే ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక కొన్ని సినిమాలు వారం రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇక ఓటీటీలో ఈ రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటిలో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ ఒకటి. నేడు షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జవాన్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అలాగే టాలీవుడ్ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ఆ సినిమానే స్కంద.
మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రామ్ పోతినేని హీరోగా బోయపాటి ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు. ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
స్కంద సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ స్కంద మూవీ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది. కానీ హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ కాలేదు.
The most celebrated electrifying melody in theatres🔥🔥🥁#NeeChuttuChuttu Full Video song is out now in all Languages only on @JungleeMusicSTH ♥️
Telugu – https://t.co/wbjUo5Q0OV Tamil – https://t.co/EkkrUM2EqO Kannada – https://t.co/FSId0f2Wjs Hindi – https://t.co/W3FsqcKXU8… pic.twitter.com/AL6cA26fOg
— Junglee Music South (@JungleeMusicSTH) October 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
