Hero Ram: మరో ప్రయోగం చేయనున్న ఎనర్జిటిక్ హీరో రామ్… ఈసారి ఏకంగా మూడు పాత్రల్లో..?
Ram Playing Triple Role: 'నేను శైలజ' తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న హీరో రామ్.. 'ఈస్మార్ట్ శంకర్' చిత్రంతో ఒక్కసారిగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రామ్..

Ram Playing Triple Role: ‘నేను శైలజ’ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న హీరో రామ్.. ‘ఈస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఒక్కసారిగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రామ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉంటే ‘ఈస్మార్ట్ శంకర్’ తర్వాత ‘రెడ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో నటించిన రామ్ మంచి నటనను కనబరిచాడు. రామ్ తర్వాతి చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘రెడ్’లో డ్యూయల్ రోల్‌లో నటించిన రామ్.. కొత్త సినిమాలో ట్రిపుల్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నాడనేది సదరు వార్త సారంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. తెలుగులో గతంలో పలు హీరోలు ట్రిప్ రోల్‌లో నటించి ఆకట్టుకున్నారు.. ఇక ఈ మధ్య కాలంలో ట్రిపుల్ రోల్‌లో ఎన్టీఆర్ ‘జయ లవ కుశ’ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఒకవేళ ప్రస్తుతం వినిపిస్తోన్న వార్తలు నిజమే అయితే తెలుగులో ట్రిపుల్ రోల్‌లో నటించిన అతికొద్ది మంది హీరోల జాబితాలో రామ్ చేరనున్నాడు.
Also Read: Kapatadhaari Movie: ‘కపటదారి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అల్లరి నరేష్‌కు పోటికి దిగిన సుమంత్..




