Rajamouli: మరో మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తోన్న జక్కన్న… మహేష్‌తో చేతులు కలిపే ఆ హీరో ఎవరు..?
Rajamouli-Mahesh Movie Update: భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి ప్రస్తుతం..

Rajamouli-Mahesh Movie Update: భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి ప్రస్తుతం మరో ఇండస్ట్రీ రికార్డు కొట్టే పనిలో ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో రానున్న రాజమౌళి ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై మరోసారి గురి పెడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే రాజమౌళి మరో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఈ విషయమై రాజమౌళి తన తర్వాతి చిత్రం మహేష్ బాబుతో ఉండనుందని స్ఫష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తవుతున్న నేపథ్యంలో రాజమౌళి తర్వాతి చిత్రంపై ఇప్పటి నంచే రూమర్లు రావడం మొదలైంది. రాజమౌళి-మహేష్ బాబు చిత్రం ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్‌తో పాటు మరో హీరో కూడా నటించనున్నాడని చర్చ జరుగుతోంది. మరి ఈ పాత్ర కోసం జక్కన్న తన చిత్రాల్లో ఇది వరకు నటించిన హీరోను తీసుకుంటాడా? లేదా మరో కొత్త హీరోను వెతుకుతాడా చూడాలి.
Also Read: Actress Nidhi Agarwal: పవన్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన ఇస్మార్ట్ భామ.. మై గోల్డెన్ ఫిల్మ్ అంటూ..




