AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena: ‘ఆ ముగ్గురు లేకపోతే మేము లేము’.. ఉప్పెన ప్రీ రిలీజ్‌లో ఎమోషనల్‌ అయిన మెగా హీరో..

aishnav Tej In Uppena Event: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయవుతున్న మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌. సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు అయిన వైష్ణవ్‌ 'ఉప్పెన' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై..

Uppena: 'ఆ ముగ్గురు లేకపోతే మేము లేము'.. ఉప్పెన ప్రీ రిలీజ్‌లో ఎమోషనల్‌ అయిన మెగా హీరో..
Narender Vaitla
|

Updated on: Feb 07, 2021 | 5:50 AM

Share

Vaishnav Tej In Uppena Event: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయవుతున్న మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌. సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు అయిన వైష్ణవ్‌ ‘ఉప్పెన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్‌ ఏర్పడింది. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. తాజాగా శనివారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను చిత్రయూనిట్‌ అట్టహాసంగా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇదిలా ఉంటే నటించేది తొలి సినిమానే అయినా వైష్ణవ్‌ బాగా మాట్లాడాడు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో వైష్ణవ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట మా అమ్మగురించి మాట్లాడాలి అంటూ మొదలు పెట్టిన వైష్ణవ్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ‘నువ్వు మా కోసం చేసిన త్యాగాలకు థాంక్స్ అమ్మా.. నువ్వు లేకపోతే మేం లేము. మా ముగ్గురు మావయ్యలు గురించి మాట్లాడాలి.. మెగాస్టార్ చిరంజీవిగారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారూ.. నాగేంద్రబాబు మావయ్యల.. వీళ్లు ముగ్గురూ లేకపోతే మేం లేము.. మాకు ఏం కావాలన్నా చేసి పెడుతుండేవారు. మా మామయ్యలకు జీవితాంతం రుణపడి ఉంటాం. నన్ను సొంత కొడుకుగా చూసుకున్నారు’ అంటూ వైష్ణవ్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

Also Read: Suriya – Jyotika : దాదాపు 14 ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న స్టార్ కపుల్.. ఎవరి డైరెక్షన్ లో అంటే..