AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vijay: హీరో విజయ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆయన సరసన నటించే ఆ ముగ్గురు కథానాయికలు ఎవరు..?

Actor Vijay: తమిళ నటుడు విజయ్‌ తాజాగా నటించిన చిత్రం 'మాస్టర్‌'. అయితే ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది....

Actor Vijay: హీరో విజయ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆయన సరసన నటించే ఆ ముగ్గురు కథానాయికలు ఎవరు..?
Subhash Goud
|

Updated on: Feb 07, 2021 | 7:36 AM

Share

Actor Vijay: తమిళ నటుడు విజయ్‌ తాజాగా నటించిన చిత్రం ‘మాస్టర్‌’. అయితే ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో విజయ్‌ మరో కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌. సెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ విజయ్‌ 65వ సినిమాకు డైరెక్టర్‌గా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రముఖంగా ముగ్గురు కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో రష్మిక, పూజా హెగ్డే, కియారా అడ్వాణి. ఈ ముగ్గురితో విజయ్‌ ఎవరితో ఆడి పాడనున్నారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇందులో ప్రధానంగా రష్మికతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సెల్సన్‌ దిలీప్‌.. రష్మికను కలిసి ఈ మూవీపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు కేజీఎఫ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ అన్బు – అరివులు యాక్షన్‌ పార్ట్‌ను కొరియోగ్రాఫ్‌ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీలో సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. డైరెక్టర్‌ సెల్సన్‌ తన తొలి చిత్రం కోలమావు కోకిలాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Uppena: ‘ఆ ముగ్గురు లేకపోతే మేము లేము’.. ఉప్పెన ప్రీ రిలీజ్‌లో ఎమోషనల్‌ అయిన మెగా హీరో..