Adah Sharma: నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోన్న అందాల తార.. మానసిక వ్యాధితో బాధపడుతోన్న..
Adah Sharma Playing Challenging Role: 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు కుర్రకారుకు నిజంగానే గుండె పోటు తెప్పించింది అందాల తార అదా శర్మ. ఈ సినిమాలో తన క్యూట్ నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది తెలుగు ఆడియన్స్‌ను...
Adah Sharma Playing Challenging Role: ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు కుర్రకారుకు నిజంగానే గుండె పోటు తెప్పించింది అందాల తార అదా శర్మ. ఈ సినిమాలో తన క్యూట్ నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ఈ క్రమంలో తాజాగా అదా శర్మ.. ‘చుహా బిల్లీ’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘చుహా బిల్లీ’ చిత్రంలో మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోందట. ఈ విషయాన్ని అదా స్వయంగా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో అదా… మానసిక వ్యాధితో బాధపడే ఒక మహిళగా నటిచంనుందని తెలుస్తోంది. ప్రసాద్ కడమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదా డిప్రెషన్‌తో బాధపడే పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి అదా శర్మ మాట్లాడుతూ.. ‘ ఈ పాత్ర నాకు కచ్చితంగా ఒక చాలెంజ్. ఈ సినిమా చాలా డార్క్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో నేను నా సహజ స్వభావానికి పూర్తిగా భిన్నంగా ఉంటాను. అందుకే ఈ పాత్రకు వెంటనే ఓకే చెప్పాను. ఈ క్యారెక్టర్ కోసం చాలా వర్క్‌షాప్స్ చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలతో పోలిస్తే ‘చుహా బిల్లీ’ పూర్తిగా భిన్నంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
Also Read: The Family man -2: మళ్లీ వాయిదా పడిన సమంత వెబ్ సిరీస్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ విడుదల ఎప్పుడంటే..