Suriya – Jyotika : దాదాపు 14 ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న స్టార్ కపుల్.. ఎవరి డైరెక్షన్ లో అంటే..

రీల్ అండ్ రియల్ లైఫ్ కపుల్ లో సూర్య జ్యోతిక ఒకరు. ఈ జంట కలిసి స్క్రీన్ మీద అకనిపించి దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం సూర్య స్టార్ హీరోగా కాంటీన్యు అవుతున్నాడు. చాలా కాలం తరవాత సుధ కొంగరు దర్శకత్వం

Suriya - Jyotika : దాదాపు  14 ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న స్టార్ కపుల్.. ఎవరి డైరెక్షన్ లో అంటే..
Follow us

|

Updated on: Feb 06, 2021 | 5:39 PM

Suriya – Jyotika : రీల్ అండ్ రియల్ లైఫ్ కపుల్ లో సూర్య జ్యోతిక ఒకరు. ఈ జంట కలిసి స్క్రీన్ మీద అకనిపించి దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం సూర్య స్టార్ హీరోగా కాంటీన్యు అవుతున్నాడు. చాలా కాలం తరవాత సుధ కొంగరు దర్శకత్వం వహించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా సిల్లును ఒరు కాదల్‌ అనే మూవీలో కనిపించారు. ఇక ఆ తరువాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకోగా..ఇక జ్యోతిక ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు.లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు జ్యోతిక. ఇన్నాళ్ల తర్వాత సూర్య జ్యోతికలు కలిసి నటించబోతున్నాడు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల నారింజమిఠాయి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన దర్శకురాలు హలితా షమిమ్ తో సినిమా చేయబోతున్నారట ఈ స్టార్ కపుల్. తమిళ ‘సిల్లు కరుపట్టి’ అనే సినిమాను తెలుగులో ‘నారింజమిఠాయి’ అనే పేరుతో డబ్ చేశారు. ఇటీవలే ఆహా వేదికగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సూర్య సమర్పకుడిగా వ్యవహరించారు. హలితా వర్క్ నచ్చి ఓ కథ రెడీ చేయమని చెప్పాడట సూర్య. అందులో తన భార్య జ్యోతికకు కూడా అవకాశం ఉండాలని చెప్పినట్లు తెలుస్తుంది. దాంతో హలితా సూర్య కపుల్ కోసం స్క్రిప్ట్ తయారు చేసేపనిలో పడిందట. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ స్టార్ కపుల్ ను తెరపై చూడొచ్చు.

మరిన్ని ఇక్కడ చదవండి..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ ఆర్టిస్ట్ .. ఫుల్లుగా మద్యం సేవించి పోలీసులకు చిక్కిన కమెడియన్..