Chiranjeevi: ‘ఈ రోజు ఆ మబ్బులన్నీ తొలగిపోయాయనిపిస్తోంది.. మీ ప్రేమకు తలవంచి నమస్కరిస్తున్నాను’… చిరు ఎమోషనల్ స్పీచ్..
Chiranjeevi Speech In Uppena Pre Release Event: 'చుట్టూ చీకట్లు.. సినిమా పరిశ్రమ మళ్లీ ఎప్పుడు పనితో కళకళలాడుతుంది.? ఎప్పుడు సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయి.? ఏవి తెలియని పరిస్థితుల్లో మబ్బులు కమ్మిన వేళ.. ఆ మబ్బులన్నీ తొలగిపోయి కాంతులు వెదజల్లుతూ.. సూర్యోదయం వస్తున్నట్లు..
Chiranjeevi Speech In Uppena Pre Release Event: ‘చుట్టూ చీకట్లు.. సినిమా పరిశ్రమ మళ్లీ ఎప్పుడు పనితో కళకళలాడుతుంది.? ఎప్పుడు సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయి.? ఏవి తెలియని పరిస్థితుల్లో మబ్బులు కమ్మిన వేళ.. ఆ మబ్బులన్నీ తొలగిపోయి కాంతులు వెదజల్లుతూ.. సూర్యోదయం వస్తున్నట్లు.. ఈ రోజు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చూస్తుంటే నాకు అనిపిస్తోంది’… ఇవీ మెగాస్టార్ చిరంజీవి ‘ఉప్పెన’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. లాక్‌డౌన్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ జరగడం బహుశా ఇదే తొలిసారి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి లాక్‌డౌన్ సమయంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించారు. సినిమా పరిశ్రమ మళ్లీ తన సత్తా చాటుకునే విధంగా.. తన ప్రభావం చూపించే విధంగా.. ఈ ఏడాది ప్రారంభమవడం శుభపరిమాణం అని తెలిపారు. ‘దీనంతటకి ప్రథమంగా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలపాలి. భవిష్యత్తులో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయో లేవో అనే భయంలో మేమున్న సమయంలో.. సినిమాలు ఓపెన్ కాగానే సినిమానే మాకున్న ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ అని నిరూపిస్తూ థియేటర్ల బాట పట్టడం పట్ల మీకు తలవంచి నమస్కరిస్తున్నాను’ అని చిరు చెప్పుకొచ్చాడు. ఇక చిరు ‘ఉప్పెన’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక అద్భుత దృశ్యకావ్యం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదన్నారు. మైత్రీ మూవీస్‌కు ఉప్పెన చిత్రం మరో రంగస్థలం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ప్రేక్షకులే కాకుండా స్క్రీన్ ప్లే ఇంత బాగా కూడా చేయొచ్చా అని నేర్చుకోవడానికైనా టెక్నిషియన్లు ఈ సినిమా చూస్తారన్నారు. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారని ఉప్పెన దర్శకుడిపై చిరు ప్రశంసలు కుర్పించారు. ఇక ఈ సినిమాలో నటించిన తమిళ నటుడు విజయ్ సేతుపతిపై చిరు పొగడ్తల వర్షం కురిపించారు. ‘ఉప్పెన’ చిత్రం.. ఫిబ్రవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Also Read: అప్పుడు అన్నయ్య సినిమాలో.. ఇప్పుడు తమ్ముడు మూవీలో కీలక పాత్రలో ఆ స్టార్ డైరెక్టర్..