Ram Gopal Varma: ఆర్జీవీ వెతుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె వయ్యారానికి వర్మ ఫిదా
ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ గత కొద్దిరోజులుగా ఓ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఆరా కూడా తీస్తున్నారు. ఆ అమ్మాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇన్ స్ట్రా రీల్స్ ను సోషల్ మీడియా షేర్ చేసి ఆమె ఎవరో కాస్త చెప్పండి అని నెటిజన్స్ ను అడుగుతున్నారు వర్మ. నెటిజన్స్ ఊరుకుంటారా.. ఇలా వర్మ అడిగారో లేదో ఆమె ఎవరు ఆమె ఇన్ స్టా ఐడి అన్ని కనిపెట్టేశారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలోకి ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కుట్రలు చుపంచనున్నారు వర్మ. ఇప్పటికే ఈ సినిమా పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ గత కొద్దిరోజులుగా ఓ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఆరా కూడా తీస్తున్నారు. ఆ అమ్మాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇన్ స్ట్రా రీల్స్ ను సోషల్ మీడియా షేర్ చేసి ఆమె ఎవరో కాస్త చెప్పండి అని నెటిజన్స్ ను అడుగుతున్నారు వర్మ.
నెటిజన్స్ ఊరుకుంటారా.. ఇలా వర్మ అడిగారో లేదో ఆమె ఎవరు ఆమె ఇన్ స్టా ఐడి అన్ని కనిపెట్టేశారు. ఆమె కేరళ బ్యూటీ అని ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్ అని చెప్పేశారు. దాంతో ఆమె గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మన సంచలన దర్శకుడు.
View this post on Instagram
ఆ అమ్మాయి అందానికి వర్మ ముగ్ధుడు అయ్యాడు. దాంతో ఆమెను ఎలాగైనా కలవాలని.. ఆమెతో సినిమా చేయాలనీ చూస్తున్నారు. ఈ మేరకు ఆమెకు సంబంధించిన రీల్స్ ను మరోసారి షేర్ చేశారు వర్మ. ఇక ఈ కేరళ కుట్టి శ్రీలక్ష్మీ సతీష్ కూడా సినిమా ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది అర్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగానే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. చీరకట్టులో ఈ చిన్నది చేసే రీల్స్ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. వర్మను సైతం ఆకట్టుకుందంటే ఆమె ఎంత అందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆమెతో శారీ అనే సినిమా చేస్తా అంటున్నారు ఆర్జీవీ. మరి ఆ బ్యూటీ వర్మ వలకు చిక్కుతుందా..? ఒక వేళ చిక్కితే ఆమెతో ఆర్జీవీ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
శ్రీలక్ష్మీ సతీష్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
రామ్ గోపాల్ వర్మ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..