Ram Gopal Varma: అందరీకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఆయనకు తప్ప.. వెరైటీగా విషెస్‌ చెప్పిన దర్శకుడు ఆర్జీవీ

|

Jan 01, 2023 | 7:52 AM

అందరూ ఒకలా చేస్తే తాను మాత్రం డిఫరెంట్‌ మరోసారి నిరూపించుకున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ తనదైన శైలిలో విషెస్‌ తెలిపారు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతన్నాయి.

Ram Gopal Varma: అందరీకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఆయనకు తప్ప.. వెరైటీగా విషెస్‌ చెప్పిన దర్శకుడు ఆర్జీవీ
Rgv
Follow us on

కొత్త సంవత్సరం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సినీ తారలు కూడా ఇన్‌స్టా వేదికగా తమ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. థ్యాంక్యూ 2022, వెల్‌కమ్‌ 2023 అంటూ తమ ఫొటోలను షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అందరూ ఒకలా చేస్తే తాను మాత్రం డిఫరెంట్‌ మరోసారి నిరూపించుకున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ తనదైన శైలిలో విషెస్‌ తెలిపారు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతన్నాయి. ‘ఇక్కడ ఎవరికి ఎవరు శుభాకాంక్షలు చెబుతారన్నది విషయం కాదు.. ఎవరూ హృదయపూర్వకంగా చెప్పేవారు లేరు. కోరికలేనవి ఉచితం. పాత సంవత్సరంలో ఉన్న సమస్యలు కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతాయి. వాటికి మరికొన్ని సమస్యలు జత చేరుతాయి. కొత్త సంవత్సరంలో సాకారం చేసుకోలేని తీర్మానాలనే చేసుకుంటాం. కనీసం ఈ విషయంలో నీతి, నిజాయతీగా అయినా ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6 బిలియన్ల జనాభాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఒక్క డొనాల్డ్‌ ట్రంప్‌నకు తప్ప. సమస్యలన్నీ డిసెంబరు 31, 2022 రాత్రి వరకూ మాత్రమే. పడుకొని నిద్రలేవగానే జనవరి 1, 2023 నుంచి అవి మనతోనే కొనసాగుతాయి. ఎందుకంటే ఇప్పటికీ నువ్వు అదే పాత భార్య, అదే పాత భర్తతో ఉంటున్నావు కనుక’

తమ భర్తలను అర్థం చేసుకోవాలి..

‘కొత్త ఏడాది సందర్భంగా నేరస్థులెవరూ పోలీసులకు పట్టుబడకూడదని నేను కోరుకుంటున్నా. అన్ని నేరాలు ఆగిపోవాలి. పోలీసులు పని లేకుండా ఉండాలి. అవకాశాల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న నటులు ఈ ఏడాది షారుఖ్‌, సల్మాన్‌, ఆమిర్‌లను మించిపోవాలి. మీ శత్రువులందరూ కలిసి, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వారి నుంచి కాపాడాలి. కొత్త ఏడాదిలో కరోనా వైరస్‌కు డేంజరస్‌ వ్యాక్సిన్ల నుంచి ఇమ్యూనిటీ రావాలని కోరుకుంటున్నా. ఈ కొత్త సంవత్సరంలో భార్యలందరూ తమ భర్తలను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’ అని వరుస ట్వీట్లు చేశారు ఆర్జీవి. ప్రస్తుతం ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..