Ram Charan: అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్ బస్టర్.. ఆరెంజ్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

చరణ్ కెరీర్‏లోనే డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో ఆరెంజ్ ఒకటి. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ పై నిర్మించారు.

Ram Charan: అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్ బస్టర్.. ఆరెంజ్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందంటే..
Ram Charan
Follow us

|

Updated on: Mar 31, 2023 | 6:19 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరమ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్. చిరుత సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చెర్రీ.. మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. స్టార్ హీరో తనయుడిగా సినీరంగంలో అడుగుపెట్టారంటూ కామెంట్స్ చేశారు. అయితే అవేం పట్టించుకోకుండా.. సినిమా సినిమాకు తన నటనను మరింత మెరుగుపరుచుకుంటూ.. ఇప్పుడు సినీ విమర్శకులచే ప్రశంసలు అందుకుంటున్నారు చరణ్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పట్టుదల ఎలా ఉంటుందనేది. ఒకప్పుడు హీరోగా సెట్ కాడు అన్న వారే.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. చరణ్ కెరీర్‏లోనే డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో ఆరెంజ్ ఒకటి. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ పై నిర్మించారు.

జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రేమ.. కొన్నాళ్లు మాత్రమే బాగుంటుందని.. లవ్ స్టోరీని డిఫరెంట్ గా చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్ భాస్కర్. కానీ అప్పట్లో ఈ చిత్రం యూత్ కు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమా అంతగా క్లిక్ కాలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాతో నాగబాబు తీవ్ర నష్టాలపాలు అయ్యారు. ఇక ఇదే సినిమాను ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేశారు నాగబాబు.

ఇవి కూడా చదవండి

మూడు రోజులపాటు స్క్రీనింగ్ అయ్యే సినిమాకు వచ్చే డబ్బులు జనసేన పార్టీకి ఇస్తానని అన్నారు నాగబాబు. అయితే ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ చిత్రం మాత్రం ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పుడు బోసిపోయిన థియేటర్లు..ఇప్పుడు యూత్‏లో హౌస్ ఫుల్ అయ్యాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 3 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈవిషయాన్ని నాగబాబు అధికారికంగా ప్రకటిస్తూ.. రీరిలీజ్ సినిమా హిట్ కావడం విశేషం అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం చెర్రీ.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.