Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ పాత్ర పేరు అదే..

ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మూడేళ్లు అవుతున్నా సినిమా రిలీజ్ కాదు కదా.. కనీసం ఒక్క అప్డేట్ కూడా లేదు. టైటిల్ పోస్టర్.. ఇటీవల జరగండి సాంగ్ మినహా గేమ్ ఛేంజర్ సినిమా గురించి అసలే అప్డేట్ రాలేదు. అలాగే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్, వీడియోస్ లీకైన సంగతి తెలిసిందే.

Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ పాత్ర పేరు అదే..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2024 | 5:10 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఎంతో హడావిడిగా మొదలైన ఈ మూవీ.. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం టైటిల్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మూడేళ్లు అవుతున్నా సినిమా రిలీజ్ కాదు కదా.. కనీసం ఒక్క అప్డేట్ కూడా లేదు. టైటిల్ పోస్టర్.. ఇటీవల జరగండి సాంగ్ మినహా గేమ్ ఛేంజర్ సినిమా గురించి అసలే అప్డేట్ రాలేదు. అలాగే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్, వీడియోస్ లీకైన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఇంకో వారం రోజులు షూట్ చేస్తే మూవీ కూడా అయిపోతుందని అంటున్నారు. అలాగే ఈ మూవీ చరణ్ రాజకీయ నాయకుడిగా.. అలాగే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం. తాజాగా ఇందులో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా చేస్తున్న రోల్ పేరు బయటకు వచ్చింది. ఇందులో చరణ్ పేరు రామ్ నందన్ అని సమాచారం. దీంతో IAS ఆఫీసర్ పాత్రకు బాగా సూట్ అయ్యిందని.. ఇప్పటివరకు లీకైన చరణ్ లుక్స్ కు తగ్గట్టే పేరు కూడా ఉందని అంటున్నారు అభిమానులు.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ రాజకీయ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. అటు రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే