Charmme Kaur: వామ్మో.. ఛార్మీ పెంపుడు కుక్క ఎంత పెద్దగా ఉందో.. ఆ బ్రీడ్ గురించి తెలుసా..?

ఇక సమంత, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వద్ద ఉన్న పెట్స్ చాలా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో వాటికి ప్రత్యేక ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు హీరోయిన్ ఛార్మీ వద్ద ఉన్న పెంపుడు కుక్క ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమ పెట్ తో ఛార్మీ ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఛార్మీ పెంపుడు కుక్క చాలా పెద్దగా ఉంది మరీ.

Charmme Kaur: వామ్మో.. ఛార్మీ పెంపుడు కుక్క ఎంత పెద్దగా ఉందో.. ఆ బ్రీడ్ గురించి తెలుసా..?
Charmme Kaur
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2024 | 4:47 PM

సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటున్నాయి. తమ ఇంటి సభ్యుల మాదిరిగానే పెట్స్ ను చూసుకుంటున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్క బ్రీడ్ పెంపుడు కుక్కలు ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సినీ స్టార్స్ విషయానికి వస్తే.. కచ్చితంగా అందరి దగ్గర పెంపుడు కుక్కలు, పిల్లులు కనిపిస్తుంటాయి. తమ పెట్స్ ఫోటోస్.. వాటితో సంతోషంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. రామ్ చరణ్ దగ్గర రైమ్ అనే పెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక సమంత, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వద్ద ఉన్న పెట్స్ చాలా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో వాటికి ప్రత్యేక ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు హీరోయిన్ ఛార్మీ వద్ద ఉన్న పెంపుడు కుక్క ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమ పెట్ తో ఛార్మీ ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఛార్మీ పెంపుడు కుక్క చాలా పెద్దగా ఉంది మరీ.

ఇదేంటీ ఇంత పెద్దగా ఉంది.. ఇది కుక్కా లేదా సింహమా..? మనిషి కంటే హైట్ ఎక్కువగానే ఉంది.. అసలు ఆ కుక్క ఏ బ్రీడ్.. ? ఎందుకు అంత పెద్దగా ఉంది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఛార్మీ దగ్గరున్న కుక్క అలస్కాన్ మలమ్యూట్ (Alaskan Malamute) అనే బ్రీడ్ కు చెందినది. ఈ బ్రీడ్ డాగ్స్ చిన్నప్పటి నుంచి చాలా పెద్దగా ఉంటాయి. ఇక పెరిగే కొద్ది మరింత పెద్దగా అవుతాయి. ఈ కుక్క దాదాపు నాలుగేళ్లుగా ఛార్మీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఛార్మీ పెంపుడు కుక్క ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఒక్కప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఛార్మీ. నితిన్ సరసన శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మీ, ప్రభాస్, ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి స్టార్ హీరోస్ సరసన కనిపించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ మెప్పించింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నిర్మాతగా మారింది. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పుడు రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీని నిర్మిస్తుంది.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.