Ram Charan: క్లీంకార సెకెండ్ బర్త్ డే.. రామ్ చరణ్ గారాల పట్టి ఇప్పుడెలా ఉందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
మెగా ప్రిన్సెస్ క్లింకారా కొణిదెల ఈ లోకంలోకి అడుగు పెట్టి అప్పుడే రెండేళ్లు గడిచాయి. 2023 జూన్ 20న రామ్ చరణ్ సతీమణి ఉపాసన క్లింకారకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ దంపతులు తమ కూతరి ఫేస్ ను అధికారికంగా రివీల్ చేయలేదు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టి క్లీంకార పుట్టిన రోజు నేడు (జూన్ 20). దీంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు, నెటిజన్లు ఈ మెగా ప్రిన్సెస్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు రామ్ చరణ్ దంపతులు తమ పాప క్లీంకార ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఉపాసన అప్పుడప్పుడు తన కూతురి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేస్ ను ఎమోజీలతో కవర్ చేస్తోంది. దీంతో మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్లీంకార పుట్టిన రోజును పురస్కరించుకుని ఉపాసన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో జూపార్కులో తన గారాల పట్టితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘ఒక సంవత్సరం క్రితం, అది కేవలం ఒక చిన్న పులి. నేడు, అది ఒక శివంగి. అయితే అది మా క్లీంకార తో తన పేరును పంచుకుంటోంది. ఈ అందమైన జ్ఞాపకాలనిచ్చిన హైదరాబాద్ జూకు ప్రత్యేక ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవిలోనే ఉన్నాయని మేము నమ్ముతున్నాం. కానీ వాటి జీవితాలను గౌరవంగా, జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు కూడా మద్దతు ఇస్తాం. దయ, ధైర్యం మరియు కరుణతో పెరగడం ఇక్కడ ఉంది’ అని రాసుకొచ్చింది ఉపాసన.
ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్లింకార కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే ఈ ఫొటోల్లో క్లీంకార ఫేస్ కొంచెం రివీల్ అయింది. దీంతో మెగా ప్రిన్సెస్ ఎంత క్యూట్‌గా ఉందో అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో ఉన్న ఓ పులి పిల్లకు తన కూతురి పేరుని పెట్టింది ఉపాసన. ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది రామ్ చరణ్ సతీమణి.
ఉపాసన పోస్ట్..
A year ago, she was just a tiny cub. Today, she’s a playful tigress named KlinKaara — after our daughter. Thank you @hydzoo for this beautiful gesture. 🐯🧡 We believe wildlife belongs in the wild, but support efforts that honour animals with dignity and care. pic.twitter.com/KCs1nvMlR7
— Upasana Konidela (@upasanakonidela) June 20, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అఖిల్ పెళ్లిలో రామ్ చరణ్ దంపతులు..
Celebrating akhil & z ♾️ ❤️ Love & togetherness 🙌 🥂 @AkhilAkkineni8 @ZainabRavdjee pic.twitter.com/txz3JMGSH5
— Upasana Konidela (@upasanakonidela) June 9, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








